24 ప్రీమియం ఎకానమీ సీట్లతో.. ఎయిరిండియా సరికొత్త విమానం..
ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విమానాలు ఆధునీకరణ, విమానాల్లో సదుపాయాలు, సీట్లు సహా అన్నింటిలోనూ సరికొత్త విధానాలతో విమాన సేవలను మెరుగుపరుస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నారోబాడీ విమానాల్లోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు.
ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విమానాలు ఆధునీకరణ, విమానాల్లో సదుపాయాలు, సీట్లు సహా అన్నింటిలోనూ సరికొత్త విధానాలతో విమాన సేవలను మెరుగుపరుస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నారోబాడీ విమానాల్లోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు. ప్రీమియం ఎకానమీ సీట్లతో కూడిన ఈ విమానం ఎయిర్ ఇండియాలో చేరింది. ఈ నారోబాడీ విమానంలో 8 విలాసవంతమైన బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు భిన్నంగా, సరికొత్త లివరీతో ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ తయారీ ప్లాంటు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ విమానం ఆదివారమే చేరింది. దేశీయ మార్గాల్లో ఈ విమానాన్ని ఆగస్టు నుంచి నడపనున్నారు. ఇప్పటికే ఎయిర్‌బస్ 320 నియో విమానాలు 3 ఎయిరిండియా దగ్గర ఉన్నా, అవన్నీ పాత డిజైన్ ప్రకారం రూపొందించినవే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్‌లో ఘటన
40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు
బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

