KCR: అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి: కేసీఆర్
'మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడేది లేదని.. ప్రజలను కాపాడాల్సింది పోయి బెదిరిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు. ప్రజలను కాపాడాల్సింది పోయి బెదిరిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదని.. నిర్మించడానికి అని తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయని.. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలని హితవు పలికారు. అందరూ కష్టపడి పనిచేయాలని.. సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలనీ కేసీఆర్ అన్నారు. రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇది చదవండి:
మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..