అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలం బలుసుతిప్ప గ్రామంలో పడవ పోటీలు కనువిందు చేశాయి. గోదావరి వలకట్ల అత్తరాల స్థలాన్ని దక్కించుకోవాడనికి మత్యకారులు పడవలతో పోటీలు పడ్డారు. గోదావరికి వరద తగ్గి ఉప్పు నీరు వచ్చిన తరువాత బలుసుతిప్ప నుండి కోటిపల్లి వరకు సుమారు 100 ఇంజిన్ బోట్లతో మత్స్యకారులు పోటీ పడ్డారు. ఎవరైతే పోటీలో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారు మళ్లీ వరదలు వచ్చే వరకు ఆ స్థలం కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది.
గోదావరిలో చేపలు ఎక్కువ ఎక్కడ పడతాయో స్థానిక మత్స్యకారులకు తెలుసు అందుకే ప్రతీ ఏటా గోదావరిలో పడవ పోటీల్లో నెగ్గి అత్తరాల ప్రాంతాన్ని బలుసుతిప్ప మత్యకారులు దక్కించుకుంటున్నారు. ఈ పోటీలు ప్రతీ ఏడాది వరదలు తగ్గిన తరువాత బలుసుతిప్ప మత్యకారులు ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. గోదావరి ఈ పడవల పోటీలు చేసేందుకు రెండు కళ్లు చాలవు.