AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎండకు తట్టుకోలేకపోయిన ఎలుగుబంటి.. ఐస్ గడ్డను చూసి ఏం చేసిందంటే.. వైరల్ అవుతన్న ఫన్నీ వీడియో..!

Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు అయితే

Viral Video: ఎండకు తట్టుకోలేకపోయిన ఎలుగుబంటి.. ఐస్ గడ్డను చూసి ఏం చేసిందంటే.. వైరల్ అవుతన్న ఫన్నీ వీడియో..!
Black Bear
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 11, 2021 | 4:43 PM

Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు అయితే మామూలు రచ్చ చేయవు. అవి చేసే అల్లరిని పలువురు తమె కెమెరాలలో బందించి.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలేస్తుంటారు యూజర్లు. ఇక చాలామంది పర్యాటకులు అడవికి టూర్‌కి వెళ్లిన సందర్భంలోనో, జూ పార్క్‌కు వెళ్లిన సందర్భంలో అక్కడి జంతువులను వీడియోలు తీస్తుంటారు. వాటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వాటిలో కొన్ని వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. ఇలా చాలా వరకు వీడియోలు నెటిజన్లను, ప్రజలను తెగ అకట్టుకుంటాయి. తాజాగా ఓ ఎలుగుబంటికి సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అదే చూస్తే మాత్రం కచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతారనడం ఎలాంటి అతిశయోక్తి లేదు.

బెంగాల్‌లోని సిలిగురి సఫారీలో హిమాలయన్ నల్ల ఎలుగుబంటి ఒకటి ఉంది. అయితే ఆ సిలిగురిలో అధిక ఉష్ణోగ్రతల ఉన్నాయి. ఆ ఎండ వేడిమిని తాళలేక హిమాలయన్ ఎలుగుబంటి తీవ్ర అవస్థలు పడింది. దాంతో అక్కడే ఉన్న ఓ కొలనులో దూకింది ఎలుగుబంటి. అయితే, ఎండ వేడిమి నుంచి ఎలుగుబంటికి రిలీఫ్ కోసం సఫారీ సిబ్బంది ఒక చిన్న కొలనును ఏర్పాటు చేశారు. అందులో ఐస్ గడ్డ కూడా వేశారు. వెంటనే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి.. అందులో దూకి కాసేపు సేద తీరింది. అంతేకాదు.. ఐస్ గడ్డను తన ఎదపై పెట్టుకుని సరదాగా ఆడుకుంది. ఎలుగుబంటి ఐస్ గడ్డతో ఆడుకుంటుండగా కొందరు వీడియో తీశారు. అయితే, ఆ వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ANI ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 43 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. దీనికి నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

AP Laptops To Students: ఏపీ విద్యార్థులకు బంపరాఫర్‌.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్న ప్రభుత్వం. అయితే..

Spicy Chilli Chicken: రెగ్యులర్ వంటలతో బోరు కొడుతుందా.. రెస్టారెంట్ స్టైల్ లో స్పైసీ చిల్లీ చికెన్ తయారు చేసి చూడండి

Bonalu: ‘అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..’ అంటూ భాగ్యనగరం సహా యావత్ తెలంగాణం బోనమెత్తుకుంటోంది