పొట్ట తగ్గాలా ?? అయితే ఈ పండ్లు తినండి చాలు
క్రమం తప్పకుండా పండ్లు తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. అయితే బరువును తగ్గించడంతో పాటు కొన్ని పండ్లు పొట్టను తగ్గిస్తాయి. క్రంచీగా ఉండే ఆపిల్ ముక్కల్లో ఫ్లేవనాయిడ్లు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెక్టిన్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, ఇది త్వరగా జీర్ణమై రక్తంలో షుగర్ స్థాయిల్ని పెంచకుండా నెమ్మదిగా జీర్ణం కావడంతో కడుపు నిండిన భావం కలుగుతుంది.
దీంతో మీరు కావలసినదాని కంటె ఎక్కువ తినడం తగ్గిస్తారు. ఆపిల్స్ లో తక్కువ క్యాలరీలు చక్కెర ఉండదు. కనుక బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫ్రూట్. టమాటాలు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. టమాటాలు కార్నిటిన్ అనే అమినో యాసిడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఈ కార్నిటిన్ శరీర మెటబాలిజంని నియంత్రిస్తుంది. 9-oxo-ODA అనే కాంపౌండ్ టమాటాల్లో ఎక్కువ. రక్తంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది టమాటాల్లో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, తక్కువగా తినే అలవాటును పెంపొందించడంలో సహకరిస్తుంది. జామకాయ కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. జామకాయల్లో ఫైబర్ ఎక్కువ, ఇది ఆకలిని తగ్గిస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ చర్యను మెరుగుపరిచి పొట్ట తగ్గుతుంది. పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కడుపు బ్లోటింగ్ ను తగ్గిస్తుంది. కివి పండ్లలో ఉండే విటమిన్ సి, ఫైబర్ కూడా పొట్ట తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కనుక బెల్లీ ఫ్యాట్ తగ్గాలని భావించేవారు ఈ పండ్లను తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోండి. నిపుణుల సూచనల మేరకే మేం ఈ సమాచారం మీకందిస్తున్నాం. ఆరోగ్య సమస్యలున్న వారు వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించాల్సిందిగా మనవి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా రైల్వే స్టేషన్లలో.. సరకులు మోస్తున్న రోబోలు
వాకింగ్ తర్వాత ఎంతసేపటికి నీరు తాగాలి ??
గంటకు 320 కిలోమీటర్ల వేగం.. భారత్‌లో దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు
తాళ్లపాక చెరువులో చెట్లు తొలగిస్తుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

