చైనా రైల్వే స్టేషన్లలో.. సరకులు మోస్తున్న రోబోలు
చైనా ప్రభుత్వం సరకు రవాణా రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. తమ దేశంలోని షెన్‌జెన్ నగరంలోని రైల్వే స్టేషన్లలో కూలీల స్థానంలో.. రోబోలను ప్రవేశపెట్టింది. ఈ రోబోలు అక్కడి రైల్వే ప్లాట్ ఫామ్‌ల మీద తిరుగుతూ.. అక్కడి దుకాణాలకు అవసరమైన సరకులను చకచకా మోస్తున్నాయి. పొట్టిగా ఉన్న ఈ రోబోలు పెద్ద పెద్ద బరువులను సైతం అవలీలగా మోసుకుని పోతుంటే.. వీటిని చూసి అక్కడి జనం భలే ముచ్చట పడుతున్నారు.
ఈ రోబోలు దాదాపు ఒక మీటరు ఎత్తు ఉంటాయి. ఇవి రైల్వే స్టేషన్‌లోని లిఫ్టులు ఎక్కి అనుకున్న చోటికి చకచకా సరుకు రవాణా చేస్తున్నాయి. అలాగే, ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న దుకాణాల వారు సరుకులు ఆర్డర్ చేయగానే.. స్టాక్ రూమ్ నుంచి వాటిని తీసుకొచ్చి వారికి అప్పగిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 41 రోబోలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో షెన్‌జెన్ సబ్‌వే స్టేషన్‌లలో ఉన్న వందకు పైగా 7-ఎలెవెన్ దుకాణాలకు కూడా ఈ రోబోలే సరుకులను అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు వారు తెలిపారు. చక్రాల సాయంతో చకచకా ముందుకు సాగుతున్న ఈ రోబోలు.. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రజా రవాణా వ్యవస్థలలో భాగస్వాములు కానున్నాయని, దీనివల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని వారు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాకింగ్ తర్వాత ఎంతసేపటికి నీరు తాగాలి ??
గంటకు 320 కిలోమీటర్ల వేగం.. భారత్‌లో దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు
తాళ్లపాక చెరువులో చెట్లు తొలగిస్తుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

