AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Alert: ఏపీని వెంటాడుతున్న జంట వాయుగుండాలు

Cyclone Alert: ఏపీని వెంటాడుతున్న జంట వాయుగుండాలు

Phani CH
|

Updated on: Nov 26, 2025 | 7:17 PM

Share

బంగాళాఖాతంలో రెండు వాతావరణ వ్యవస్థలు బలంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన జారీ అయింది. ఒక వాయుగుండం, మరో అల్పపీడనం ప్రభావంతో శనివారం నుండి రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఒక వాయుగుండం కొనసాగుతుండగానే, దాని వెనుక మరో అల్పపీడనం బలపడుతుండటంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ అయింది. మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ దిశగా, ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ బుధవారం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది తుపానుగా మారేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణ అధికారుల ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ వాయుగుండం శని, ఆదివారాల నాటికి తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు రావచ్చని లేదా సముద్రంలోనే బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. మరోవైపు, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో అల్పపీడనం కూడా బుధవారం తీవ్ర అల్పపీడనంగా, అనంతరం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని, దీని ప్రభావం కూడా ఏపీ, తమిళనాడులపై ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు వాయుగుండాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన అనంతపురం అమ్మాయి అదుర్స్‌.. తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ను అందుకున్న దీపిక

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

బాలయ్య క్రేజ్‌ ముందు మోకరిల్లిన అవెంజర్స్‌

సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి