Srisailam Dam:  10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తిన అధికారులు.. డ్రోన్ వీడియో చూడండి

Srisailam Dam: 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తిన అధికారులు.. డ్రోన్ వీడియో చూడండి

Ram Naramaneni

|

Updated on: Aug 03, 2024 | 1:39 PM

భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు 20 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ విజువల్స్ చూడండి....

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4లక్షల 54వేల 710 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 5లక్షల 26వేల 501 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 204 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలాన్ని దాదాపు పూర్తిగా నింపిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్‌ దిశగా పరుగులు పెట్టడంతో సాగర్‌కు కూడా జలకళ వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరద సాగర్‌ క్రస్ట్‌ గేట్లను తాకింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు 5 లక్షల 26వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది. 34 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 230 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..