AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..? ఎందుకు ఏర్పడతాయి..? మున్ముందు మరిన్ని చూడాల్సి వస్తుందా?

క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..? ఎందుకు ఏర్పడతాయి..? మున్ముందు మరిన్ని చూడాల్సి వస్తుందా?

Ravi Panangapalli
|

Updated on: Aug 03, 2024 | 3:12 PM

Share

వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, ఒక చిన్న ప్రాంతంలో అంటే ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు ప్రాంతంలో ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.

ఆకాశం బద్దలయ్యిందా..? రాజకీయ సభల్లో తరచు మన నేతలు ఈ మాటలు వాడటం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ నిజంగా ఆకాశం బద్దలైతే ఎలా ఉంటుందో తెలుసా..? అచ్చంగా కేరళలోని వయినాడ్ జరిగినట్టే ఉంటుంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో పడితే దాని తీవ్రత.. ఆపై దాని వల్ల జరిగే ఉపద్రవం… ఎంత ఉంటుందో ఎవ్వరికీ ఊహించడానికి కూడా సాధ్యం కావడం లేదు. నాలుగు రోజులుగా వయనాడ్ పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా కనిపిస్తున్న ఘోరమైన దృశ్యాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. వాతావరణ పరిశోధకులు దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. మొన్నటికి మొన్న వయినాడ్‌లో, నిన్న ఢిల్లీలో.. ఆ తర్వాత హిమాలయ పర్వతానువుల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కసారిగా కురుస్తున్న కుంభవృష్టి ధాటికి..ఊళ్లకు ఊళ్లే నాశనమైపోతున్నాయి. ఆస్తి నష్టం గురించి చెప్పే సాహసం కూడా ఎవ్వరూ చెయ్యలేని పరిస్థితి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండబట్టీ కనీసం ప్రాణ నష్టాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నాల్లో ఉంటున్నాయి ప్రభుత్వాలు. ఎక్కడ క్లౌడ్ బరస్ట్‌ ఏర్పడతాయో ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండటం… అటువంటి ప్రాంతాల్లో గంట గంటకు వెదర్ అప్ డేట్స్ అందిస్తూ అటు అధికారుల్ని, స్థానికుల్ని హెచ్చరిస్తూ ఉండటంతో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, ఒక చిన్న ప్రాంతంలో అంటే ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు ప్రాంతంలో ఒక గంటలో 10 సెం.మీ...