చల్లగా ఉంటదని పిల్లల్ని ఏసీ గదిలో ఉంచుతున్నారా ??
మీ పిల్లల్ని ఏసీ గదిలో ఉంచుకున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే. వేసవి కాలంలో దాదాపు అన్ని ఇళ్లలో ఏసీని ఉపయోగిస్తారు. దీన్ని యూజ్ చేయడం వల్ల టెంపరేచర్ నుంచి మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. పైగా దీన్ని వాడుకోవడం కూడా చాలా తేలిక, సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు దీన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల వారి ఆరోగ్యంపై చాలా ఎఫెక్ట్ పడుతుంది.
మీ పిల్లల్ని ఏసీ గదిలో ఉంచేటప్పుడు దాన్ని ఫ్యాన్ ల మాత్రమే ఆన్ చేయండి. అలాగే దాని డైరెక్షన్ కూడా పైకి ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీరు ఏసీ ఆన్ చేసేటప్పుడు 26 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ లో ఉంచాలి. మీ పిల్లల్ని ఏసీ గదిలో ఉంచేటప్పుడు వాళ్లకు సరైన దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే వాళ్లు ఏసీలో ఉండేటప్పుడు 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే మంచిది. మీ పిల్లల్ని ఏసీలో ఉంచేటప్పుడు వాళ్ల బాడీలోని నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. అలాగే ఏసీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే మీరు ఖచ్చితంగా ఏసీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీంతో ఏసీ వాడకం మళ్ళా ఎదురయ్యే చెడు పరిణామాలను వారు ఫేస్ చేయాల్సి వస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందో తెలుసా ??
ఈ చేప తెలివి మామూలుగా లేదుగా.. వలనుంచి ఎలా తప్పించుకుందో చూడండి
మన్యం గిరుల్లో పూసే.. ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా !!
ఇలాంటి యాక్సిడెంట్ జరిగితే బతకడం కష్టమే.. కానీ వీళ్లకు ఎక్కడో సుడి ఉన్నట్టుంది
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

