పల్లీలు నానబెట్టి తింటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే
నానబెట్టిన పల్లీలు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. వేరుశెనగను సామాన్యుడి జీడిపప్పు అని అంటారు. ఇవి పోషకాల స్టోర్ హౌస్. పనిలో అలసిపోయినా, శక్తి లేకపోయినా గుప్పెడు పల్లీలు తింటే తక్షణ శక్తి వస్తుంది. వేరుశెనగలు లిపిడ్లు, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఇది హెల్తీ స్నాక్స్ లో ఒకటే. నానబెట్టిన పల్లీలు తీసుకోవడం వల్ల ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. వేరుశెనగలు నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నానబెట్టిన వేరుశెనగలను ప్రతిరోజు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడటం మరియు రోగ నిరోధక శక్తి పెరగడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి. వేరుశెనగలను ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకొని తీసుకోవాలి. దాని నుంచి 567 కేలరీలు మనకు లభ్యమవుతాయి. వేరుశెనగలు ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా మోనోశాచురేటెడ్ మరియు పాలిఅన్శాచురేటెడ్ కొవ్వులు ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో మరియు గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేరుశెనగలు ప్రోటీన్ యొక్క మంచి మూలం. ఇది ఖనిజాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి అవసరం. వీటిలో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వారు వారి డైట్ లో నానబెట్టిన వేరుశెనగ ఖచ్చితంగా చేర్చుకోవలసి ఉంటుంది. నానబెట్టిన వేరుశెనగలో ఫైబర్ అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చల్లగా ఉంటదని పిల్లల్ని ఏసీ గదిలో ఉంచుతున్నారా ??
వైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందో తెలుసా ??
ఈ చేప తెలివి మామూలుగా లేదుగా.. వలనుంచి ఎలా తప్పించుకుందో చూడండి
మన్యం గిరుల్లో పూసే.. ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా !!
ఇలాంటి యాక్సిడెంట్ జరిగితే బతకడం కష్టమే.. కానీ వీళ్లకు ఎక్కడో సుడి ఉన్నట్టుంది
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

