AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మో ఇంత ధైర్యం ఎక్కడిదమ్మా! మోస్ట్ డేంజర్ పామును సెకన్లలోనే పట్టేసింది..

చాలా వరకు బొద్దింకలు చూస్తేనే జడుసుకునే అమ్మాయిలు ఉంటారు. అలాంటి వారిని మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. కానీ, అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పామును..

Watch Video: అమ్మో ఇంత ధైర్యం ఎక్కడిదమ్మా! మోస్ట్ డేంజర్ పామును సెకన్లలోనే పట్టేసింది..
Snake Caught
Shiva Prajapati
|

Updated on: Jan 17, 2023 | 2:16 PM

Share

చాలా వరకు బొద్దింకలు చూస్తేనే జడుసుకునే అమ్మాయిలు ఉంటారు. అలాంటి వారిని మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. కానీ, అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పామును సైతం ఏమాత్రం భయపడుకుండా సెకన్ల వ్యవధిలోనే పట్టేసుకుంది ఓ యువతి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అమ్మాయి పామును పట్టిన విధానం, బంధించిన విధానం చూస్తే ఏం గుండె ధైర్యం తల్లీ నీది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అమ్మాయి పామును బంధించడానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాండ్స్ వస్తోంది. అదసలే నాగుపాము, ఏమాత్రం తేడా వచ్చినా పాము కాటుకు గురికాక తప్పదు. కానీ, ఆ భయమేమీ ఆ అమ్మాయికి లేదు. పైగా, అదేదో ఆట వస్తువు అయినట్లుగా అలవోకగా విషపూరితమైన పామును పట్టేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. ఓ నాగుము ఓ ఇంట్లోకి దూరింది. మెట్ల మార్గం నుంచి లోపలికి సరసరా వెళ్తోంది. పామును గమనించిన యువతి.. వెంటనే దాని తోకను పట్టేసుకుంది. అది బుసలు కొడుతున్నా ఏమాత్రం భయపడకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఓ డబ్బా తీసుకురావాల్సిందిగా ఇతరులను కోరింది. వెంటనే వారు డబ్బా తీసుకురాగా.. పామును అందులో బంధించింది. అనంతరం దానికి మూత భిగించి, చాలా జాగ్రత్తగా తీసుకెళ్లింది. నిర్మానుష్య ప్రాంతంలో పామును సురక్షితంగా వదిలేసింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆ వీడియో చూసి యువతికి సెల్యూట్ కొడుతున్నారు. అంతటి ధైర్యం ఎలా సాధ్యం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..