AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘మేం కాళ్లు పట్టుకుని అడిగినా ఇవ్వరు కదా సార్’.. ఆ అమ్మాయి అలా చేయగానే..

రాంగ్ పార్కింగ్‌ చేయడంతో పోలీసులు ఆ యువతి స్కూటీని తమ వాహనంలోకి ఎక్కించారు. అయితే ఆ స్కూటీ ఓ యువతి తిరిగి వెంటనే విడిపించుకోగలిగింది. ఏడుపు అనే ‘వెపన్’ వాడిన ఆమె, పోలీస్ అధికారి ముందే ఏడుస్తూ కోరడంతో చివరికి స్కూటీని అప్పగించారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Viral Video: 'మేం కాళ్లు పట్టుకుని అడిగినా ఇవ్వరు కదా సార్'.. ఆ అమ్మాయి అలా చేయగానే..
Viral Video
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2025 | 5:54 PM

Share

ఇప్పుడు మన బైక్స్ రోడ్డు పక్కన పార్క్ చేశారు అనుకోండి.. పోలీస్ వారు వెహికల్‌తో వచ్చి రాంగ్ పార్కింగ్ అని తీసుకెళ్లిపోతారు. ఆ బైక్‌ ఒక్కసారి వారి వాహనం పైకి ఎక్కించారంటే.. మళ్లీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫైన్ కట్టి తెచ్చుకోవాల్సిందే. ఎక్కించేటప్పుడు చూసినా.. సరే ఎంత బ్రతిమాలినా సరే పోలీసువారు ఇవ్వరు. రూల్స్ పాటించాల్సిందే అంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ అమ్మాయి తన స్కూటీని తిరిగి వెనక్కి తీసుకోచ్చుకోగలిగింది. అందుకు తను వాడిన అస్త్రం ఏంటో తెలుసా..? ఏడుపు. అవును.. తన బైక్ పోలీస్ వాహనంపైకి ఎక్కించాక ఆ యువతి అక్కడికి చేరుకుంది. వెనక ఉన్నవారిని తన వాహనం ఇవ్వాల్సిందిగా కోరింది. కాసేపు ఆ వాహనం పట్టుకుని అక్కడే నిలబడింది.  అయితే వెహికిల్ తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో ఏడ్చుకుంటూ వాహనంలో ముందు కూర్చున్న పోలీస్ ఆఫీసర్ వద్దకు వెళ్లి తన స్కూటీ ఇవ్వాలని ఏడుస్తూ అడిగింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ అధికారి.. ఏం చేయాలో అర్థం కాక కాసేపు నవ్వుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ వారి వాహనం కాస్త ముందుకు కదిలింది. దీంతో మరోసారి.. ఆ యువతి ఆ వాహనాన్ని పట్టుకోవడంతో.. వారు దాన్ని నిలిపివేశారు.

ఈ సమయంలో ఆ యువతి స్నేహితురాలితో పాటు.. రోడ్డు పక్కన ఉన్న ఓ బాటసారి వచ్చి బైక్ ఇచ్చేయాలని పోలీస్ వారిని కోరారు. దీంతో కన్విన్స్ అయిన పోలీస్ అధికారి.. ఆ వాహనాన్ని ఇచ్చేశారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. మా అబ్బాయిలు కాళ్లు పట్టుకున్నా ఇవ్వరు కదా సార్ అని ఒకరు కామెంట్ పెట్టగా.. ఆడాళ్ల వెపన్ ఏడుపు.. వారు దానితో దేన్నైనా సాధించగలరు అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్