AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకో జాలీ రైడ్ కావాలి గురూ..! ఢిల్లీ రైల్లో ప్రయాణించిన కోతి.. వీడియో చూడండి

ఢిల్లీ మెట్రో కోచ్‌లోకి ఒక కోతి ప్రవేశించింది. రైలు కోచ్‌లో రైలులో అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించింది. అదే సమయంలో, కోతి అకస్మాత్తుగా ప్రవేశించడం ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కోతి కనిపించడంతో భయంతో వణికిపోయారు. చివరికీ, మెట్రో ఉద్యోగులు కోతిని సురక్షితంగా రైలు నుంచి బయటకు తీసి స్టేషన్ వెలుపల వదిలివేయడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

నాకో జాలీ రైడ్ కావాలి గురూ..! ఢిల్లీ రైల్లో ప్రయాణించిన కోతి.. వీడియో చూడండి
Monkey Inside Delhi Metro
Balaraju Goud
|

Updated on: Aug 12, 2025 | 6:10 PM

Share

సోమవారం, ఆగస్టు 11న ఢిల్లీ మెట్రో రైలులో జరిగిన ఫన్నీ సంఘటన వెలుగులోకి వచ్చింది. మెట్రో రైలు లోపల ఒక కోతి తిరుగుతున్నట్లు కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో కోతి మెట్రో కంపార్ట్‌మెంట్‌లో అక్కడక్కడ దూకి ప్రయాణికుల మధ్య తిరుగుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో ప్రజలకు హాస్యాస్పదంగా మారడమే కాకుండా, ఢిల్లీ మెట్రో భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలను తలెత్తున్నాయి.

ఈ సంఘటన ఢిల్లీ మెట్రో బ్లూ లైన్‌లోని వైశాలి మెట్రో స్టేషన్‌లో జరిగింది. మెట్రో రైలు లోపల ప్రయాణికుల మధ్య కోతి తిరుగుతున్నట్లు వీడియో కనిపించింది. వైరల్ వీడియోలో, ఒక కోతి మెట్రో కంపార్ట్‌మెంట్‌లో దూకుతున్నట్లు కనిపిస్తుంది. అది సీట్లపైకి ఎక్కి, రెయిలింగ్‌లను పట్టుకుని, ప్రయాణికుల మధ్య తిరుగుతూ.. కనిపించింది. కొంతమంది ప్రయాణీకులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్‌లో బంధించారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. వీడియోలో, ప్రయాణీకులు నవ్వుతూ కోతి చేష్టలను ఆస్వాదించారు. అయితే కొంతమంది ప్రయాణీకులు కోతిని చూసి భయాందోళనలకు గురయ్యారు.

వీడియో చూడండి..

ఆ వీడియోలో కొంతమంది ప్రయాణీకులు కోతిని చూసి నవ్వుతుండగా, మరికొందరు దానికి దూరంగా జరుగుతూ భయపడిపోయారు. కోతి వల్ల ఏ ప్రయాణీకుడికి హాని జరగలేదు. కోతి కూడా కంపార్ట్‌మెంట్‌లో ప్రశాంతంగా తిరుగుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నెటిజన్లు దీనికి ఫన్నీ స్పందనలు తెలియజేస్తున్నారు. ఈ సంఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, మెట్రో ఉద్యోగులు కోతిని సురక్షితంగా రైలు నుంచి బయటకు తీసి స్టేషన్ వెలుపల వదిలివేసినట్లు వర్గాలు తెలిపాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..
రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే..
రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే..
చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?
చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?
WPL 2026: ఆ మూడు మ్యాచ్‌లకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?
WPL 2026: ఆ మూడు మ్యాచ్‌లకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే