Workouts: సముద్రం అడుగున వ్యాయామం.. పాండిచ్చేరి యువకుని సాహసం.. ఇదంతా అందుకోసమే!
Workouts underwater: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో శారీరకంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. ధైర్యంగా ఉండటం.. మంచి ఆహారం తీసుకోవడం.. శారీరకంగా ఫిట్ నెస్ కలిగి ఉండటం అవసరం.
Workouts underwater: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో శారీరకంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. ధైర్యంగా ఉండటం.. మంచి ఆహారం తీసుకోవడం.. శారీరకంగా ఫిట్ నెస్ కలిగి ఉండటం.. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ఇప్పుడు అందరికీ చాలా అవసరం. ఈ విషయాల్లో ఎలా ఉండాలో ఏం చేయాలో ఎంతో మంది నిత్యం మనకు చెబుతూనే ఉన్నారు. మంచి ఆహరం ఎలా తీసుకోవాలి.. ఫిట్ నెస్ ఎలా పెంచుకోవాలి అనే విషయాలపై ఎన్నో విశేషాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అందుకోసం చేయాల్సిన కనీస వర్కౌట్లను పట్టించుకోవడంలేదు. రోజూ కొంత సేపు వ్యాయామం..కరోనాను ఎదుర్కోవడంలో మంచి సహాయకారి అవుతుంది. ఇది తెలిసినా చాలా మంది శారీరకంగా దృఢంగా ఉండటం మీద పెద్దగా దృష్టి సారించడం లేదు. అందుకే ఇప్పుడు ఒక యువకుడు కొత్త పద్ధతిలో తాను వర్కౌట్స్ చేసి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు.
పాండిచ్చేరికి చెందిన అరవింద్ శిక్షణ పొందిన డైవర్. ఆయన గత 20 ఏళ్ల నుంచి చెన్నై, పాండిచ్చేరి తీరంలో డైవింగ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈయన కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఫిట్ బాడీని నిర్వహించడం ప్రాముఖ్యతను అందరికీ తెలియపరచం కోసం, అవగాహనను పెంచడం కోసం నీటి అడుగున అనేక వ్యాయామాలు చేశారు.
అరవింద్ సముద్రంలో 14 మీటర్ల నీటి అడుగున కంటి గేర్ రక్షణతో సముద్రపు అడుగున ఉన్న బెడ్ పై వ్యాయామాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన శరీరం అదేవిధంగా ఊపిరితిత్తులను ధృఢంగా ఉంచడం చాలా అవసరం అని చెప్పారు. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి అని అంటున్నారు. శ్వాస వ్యాయామాలు చేయాలి అని చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయన అన్నారు.
ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్క్ లు ధరించడం, చేతులు కడుక్కోవడం ఖచ్చితంగా అవసరం, అయితే శరీరం, మనస్సు బలంగా ఉండటానికి శారీరక వ్యాయామాలపై కూడా దృష్టి పెట్టాలి అని అరవింద్ చెబుతున్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించడానికే ఈవిధంగా సముద్రంలో వర్కౌట్స్ చేసినట్టు తెలిపారు. సముద్రం అడుగున నీటిలోనే ఇంత సులభంగా వర్కౌట్స్ చేయగలుగుతుంటే.. ఇక భూ ఉపరితలంపై వ్యాయామాలు చేయడం పెద్ద కష్టమైన పని కాదని వివరించడం కోసం ఇలా చేశానని అరవింద్ స్పష్టం చేశారు.
అరవింద్ వర్కౌట్ (Workouts underwater) వీడియో ఇక్కడ మీరు చూడొచ్చు..
Man from Puducherry does Exercise 14 more deep water to emphasize on need of exercise during pandemic.
Does Dumbell curls and Barbell curls under water as fishes swim by.. pic.twitter.com/pCVbx6O1H5
— Pramod Madhav♠️ (@PramodMadhav6) May 10, 2021