AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఏం టాలెంట్ బాసూ.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. ఫిదా అవుతోన్న మగువలు..

చాలా మంది మగువలకు చీర కట్టుకోవడంలో నిత్యం సమస్యలు ఎదురవడం శరామామూలే. అయితే చీర ఎలా కట్టుకోవాలనే విషయంపై నెట్టింట చాలా వీడియోలే

Watch Video: ఏం టాలెంట్ బాసూ.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. ఫిదా అవుతోన్న మగువలు..
Shopkeeper Draping Saree
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 20, 2022 | 1:28 PM

Share

సాధారణంగానే చీర కట్టుకోవడమనేది ఒక  కళ. ఇక చాలా మంది మగువలకు చీర కట్టుకోవడంలో నిత్యం సమస్యలు ఎదురవడం శరామామూలే. అయితే చీర ఎలా కట్టుకోవాలనే విషయంపై నెట్టింట చాలా వీడియోలే ఉన్నాయి. వాటిలో కొన్ని వైరల్ అయినవి కూడా ఉన్నాయి. వీటిని చూసి మగువలు నోరెల్లబెట్టేస్తుంటారు. అయితే ఇంతక ముందు వచ్చిన వీడియోలన్నీ దాదాపుగా చీర ఎలా కట్టుకోవాలనే విషయం పైనే. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో వాటికి విరుద్ధం. ఎందుకంటే ఈ వీడియోలో చీరల షాపు ఓనర్ చీర ఎలా కట్టుకోవాలి అనేది మాత్రమే కాక సులభంగా ఎలా కట్టుకోవాలో కూడా చూపించాడు.

అయితే ఈ వీడియో చాలా వేగవంతంగా సాగుతోంది. ఇక కేవలం 11 సెకన్లే ఉన్న ఈ వీడియోలో షాప్ ఓనర్ చీర కట్టుకోవడంలో చూపిన అద్భుత నైపుణ్యం మగువలనే కాక మగవారినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. “బ్రో.. నాకు దీన్ని కొనాలనిపించేలా చేశావు” అనే కాప్షన్‌తో ఉన్న ఈ వీడియో @PunjabiTouch అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్  అయింది.

ఇవి కూడా చదవండి

మూడు రోజుల క్రితమే షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 48 వేల వీక్షణలు వచ్చాయి. ఇంకా 1300 వందలకు పైగా లైకులు, అనేక మంది నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా అందుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన మగువలు అయితే ఫిదా అయిపోయారు అని చెప్పుకోవాలి. వారిలో ఓ మహిళ ‘ మీ నైపుణ్యం అభినందనీయం’, మరొ మహిల ‘ఆ వ్యక్తి చాలా ప్రతిభావంతుడు’ అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..