Viral Video: అయ్యబాబోయ్‌ ఇంత డబ్బా..? ఎత్తలేక చీపురుతో ఊడ్చేస్తున్న మహిళ.. నెటిజన్ల రియాక్షన్‌ చూడాల్సిందే..!

జీవితం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. తినడానికి బట్టలు లేనివారు, నిత్యావసరాలకు కూడా డబ్బులు లేనివారు, ఉండేందుకు చిన్న పైకప్పు కూడా లేని వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే డబ్బును గౌరవించాలి అంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఇంటి నిండా చెల్లాచెదురుగా పడివున్న నోట్లను సేకరిస్తున్న విధానం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది.

Viral Video: అయ్యబాబోయ్‌ ఇంత డబ్బా..? ఎత్తలేక చీపురుతో ఊడ్చేస్తున్న మహిళ.. నెటిజన్ల రియాక్షన్‌ చూడాల్సిందే..!
Woman Sweeps Up Cash
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 27, 2024 | 7:17 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలు కొన్ని ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. మరికొన్ని ఆసక్తికరంగా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. మరికొందరు మాత్రం లైక్‌లు, షేర్లు, వ్యూస్‌ కోసం వింత వింత పనులు చేస్తుంటారు. విచిత్రమైన చేష్టలతో, ఏమైనా చేయటానికి కూడా వెనుకాడరు. ఏది ఏమైనా కొన్ని రోజులుగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక యువతి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏంటా వీడియో, ఆ మహిళ చేసిన పనేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

డబ్బును ఎంతో గౌరవంగా చూడాలని మన పెద్దలు చెబుతుంటారు. ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే, డబ్బును లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తాం. ఇక మన జీవితం ముందుకు సాగాలంటే మన చేతిలో అవసరమైన డబ్బు ఉండాలి. జీవితం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. తినడానికి బట్టలు లేనివారు, నిత్యావసరాలకు కూడా డబ్బులు లేనివారు, ఉండేందుకు చిన్న పైకప్పు కూడా లేని వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే డబ్బును గౌరవించాలి అంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఇంటి నిండా చెల్లాచెదురుగా పడివున్న నోట్లను సేకరిస్తున్న విధానం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagram హ్యాండిల్ @mrs.good.luckyలో కనిపించింది. సోషల్ మీడియా బ్లాగర్ అనస్తాసియా బల్వనోవిక్ వీడియో. అనస్తాసియా వీడియోలో నోట్లను చీపురుతో చిమ్మటం కనిపిస్తుంది. వీడియో చూస్తుంటే చెత్తబుట్టలో పడేస్తారేమో అని అనిపిస్తుంది.

ఈ వీడియో చూడండి..

ఏది ఏమైనప్పటికీ, ఈ వీడియో గమనించిన తర్వాత చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. యువతి చేస్తున్న పని సరైనది కాదని అంటున్నారు. డబ్బును గౌరవించాలని ప్రతి ఒక్కరూ సూచించారు. అదే సమయంలో అవి నిజంగా నోట్లేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..