Viral Video: ఈ అమ్మాయి మహా ముదురు. తమకి తాముగా బైక్ మీద నుంచి పడి.. వెనుక వస్తున్న బైకర్‌పై తిట్ల దండకం..
ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ.. స్కిడ్ అయి కిందపడిపోయారు. ఆ ఇద్దరిలో ఒక యువతి వెంటనే పైకి లేచి.. తన బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టడం వల్లే పడిపోయానంటూ వెనుక వస్తున్న బైకర్‌పై తిట్ల దండకం అందుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Viral Video: కొందరు తాము ఏదైనా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న సమయంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మొదట ఎదుటివాళ్లను ఇరికించడానికి తెగ ప్రయత్నాలు చేస్తారు. ఇదిగో ఈ ఘటన కూడా అలాంటిదే. సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. రెండు బైక్‌లు ఢీ కొట్టుకోవడమో లేదా బైక్‌ను వెనుకనుంచి కారు గుద్దడమో చూస్తుంటాం. తాజాగా ఓ యువతి యువకుడు స్కూటీ మీద వెళ్తూ.. స్కిడ్ అయి కిందపడిపోయారు. ఆ ఇద్దరిలో ఒక యువతి వెంటనే పైకి లేచి.. తన బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టడం వల్లే పడిపోయానంటూ వెనుక వస్తున్న బైకర్‌పై తిట్ల దండకం అందుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఇద్దరూ స్కూటీపై వెళ్తున్నారు. అకస్మాత్తుగా బండి స్కిడ్ అయ్యి రోడ్డుపైన పడిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న మహిళ లేచి వెనుక వస్తున్న బైకర్‌ను నిందించడం ప్రారంభించింది. అయితే, ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటన తర్వాత.. అక్కడి పోలీసులు ఎవరిది తప్పని సీసీ కెమెరా పరిశీలించారు. అప్పుడు వారు షాకింగ్ కు గురయ్యారు. పాపం.. బైకర్ కనీసం యువతి దరిదాపుల్లో కూడా లేడు.
वाह क्या सीन है दीदी।
इसलिए पुरुष आयोग ज़रूरी है। pic.twitter.com/2EHEWRDf3e
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 19, 2022
యువతి మాత్రం ఏదో కావాలని తాకించినట్లు నానా రచ్చ చేసింది. దీనిపై యువతిని అధికారులు మందలించారు. అయితే, అక్కడ సీసీ కెమెరా ఉండటం వల్ల బైకర్ బతికిపోయాడు. లేకపోతే.. మనోడి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా.. లక్షల్లో లైక్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..