AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ పాము యమ డేంజర్.. కానీ అక్కను చూడగానే సైడైపోయింది.. వీడియో చూస్తే

ఈ పాము చాలా డేంజర్.. కానీ ఈ అక్క చూడండి.. ఏదో పెంపుడు పామును తరిమినట్టు తరుముతోంది. ఈ వీడియో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

Viral Video: ఈ పాము యమ డేంజర్.. కానీ అక్కను చూడగానే సైడైపోయింది.. వీడియో చూస్తే
Snake
Ravi Kiran
|

Updated on: Nov 11, 2024 | 11:50 AM

Share

అప్పట్ల నాగమ్మ, నాగదేవత, నాగశక్తి, నాగకన్య, నాగపంచమి, నాగబాల, నాగపూజా మహిమ.. లాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఆ సినిమాల్లో పాములకు పూజలు చేసే హీరోయిన్లను ఎప్పుడూ కాటేయ్యవు.. హీరోయిన్లను టార్చర్ పెట్టే విలన్లను మాత్రం కాటేసి చంపుతాయి. అదంతా సినిమా కాబట్టి నడిచింది. కానీ బయట నిజమైన పాములకు వీళ్లు మాములు మనుషులు, వాళ్లు విలన్లు అని తేడా చూపించవు. దగ్గరకొస్తే కాటేసేస్తాయి. కానీ బీహార్‌లో ఓ చిత్రమైన సీన్ చోటు చేసుకుంది.

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

ఇవి కూడా చదవండి

సాధారణంగా మనకు ఆమడదూరంలో పాములు కనిపిస్తే చాలు.. ఠక్కున పరుగో పరుగు పెడతాం. మళ్లీ ఆ ప్రాంతం వైపు కూడా ఓ లుక్కు వేయం. కానీ ఇక్కడొక అక్క చూడండి.. ఛత్ పూజ చేసేందుకు నీళ్లల్లోకి దిగితే.. పక్కన పాము తిరుగుతున్నా.. కొంచెమైనా భయం లేకుండా.. అలానే నిలబడింది. అంతేకాదు నీళ్ళలో కార్తిక దీపాన్ని వదులుతూ.. ఆ పామును దూరం తోస్తోంది. అదేదో పెంపుడు పామే అన్నట్టు.. అక్క ఎంత లైట్ తీసుకుందో.. కానీ ఆ పాము కాటేస్తే నిమిషాల్లో ప్రాణం పోయేంత విషముండే క్రెయిట్ పాము అది. చాలా డేంజర్. అయినా.. కానీ అక్క ఆదరట్లేదు.. బెదరట్లేదు.. ఈ బీహారి బెహన్.

దేశమంతా చట్ పూజలు జరుగుతున్నాయి. ఉదయాన్నే కార్తిక దీపాన్ని నీటిలో వదిలి.. సూర్యనమస్కారాలు చేస్తారు మహిళలు. ఇలానే బీహార్‌లో కూడా ఈ మహిళ నదిలోకి దిగి సూర్య నమస్కారాలు చేస్తుంటే.. ఊహించని అతిధిలా వచ్చి పలకరించింది ఈ పాము. కాటేయకుండా.. పండుగ పూట హాలిడే తీసుకున్నట్టు ఉంది. సైలెంట్‌గా పక్క నుంచి వెళ్లిపోతోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..