Viral Video: పాడుబడ్డ ఇంటిని పరిశీలిస్తుండగా మహిళ స్టన్.. ఎదురుగా కనిపించింది చూడగా..
ఓ మహిళ తనకు దగ్గరలో ఉన్న ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్ళింది. తన స్నేహితులు కూడా కలిసి ఆమెతో వెళ్ళగా.. అక్కడ వారికీ అనుకోని సంఘటన ఎదురైంది. అదేంటో మీరూ చూస్తే దెబ్బకు షాక్ అవుతారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

ఓ మహిళ పాడుబడిన ఫ్యూనరల్ ఇంటిని పరిశీలిస్తుండగా.. భయానక సీన్ కనిపించింది. దాన్ని చూడగా ఆమె దెబ్బకు షాక్ అయ్యింది. ఏప్రిల్ వెర్టుచి అనే మహిళ.. ఐదు సంవత్సరాల క్రితం మూసివేసిన స్వాన్సన్ ఫ్యూనరల్ హోమ్‌ను పరిశీలించడానికి వెళ్ళింది. శిథిలావస్థలో ఉన్న ఆ పాడుబడ్డ ఇంటిని పర్యాటకులకు అనువైన చోటుగా మార్చారు స్థానిక అధికారులు. అయితే ఏప్రిల్ అక్కడికి చేరుకోగానే.. ఆమె, ఇద్దరు స్నేహితులు ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కనుగొన్నారు.
41 ఏళ్ల ఆ మహిళ స్నేహితురాలు.. ఆ ఇంటి బేస్‌మెంట్‌లోకి దిగగానే అక్కడ కనిపించింది చూసి షాక్‌తో కేకలు వేశారు. ఆ సమయంలో వారికి కనిపించింది ఏంటంటే.. గత కొన్నేళ్ల కిందట ఆ పాడుబడిన ఇంటిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పడిపోయిన కాస్కెట్ లిఫ్ట్ కింద నలిగిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని వారు కనుగొన్నారు. అక్కడ ఆ మృతదేహం మొండెం పైభాగం మాత్రమే కనిపించింది. అతడి మొబైల్ ఫోన్ ఆ మృతదేహం చేతికి అందనంత దూరంలో ఉంది. అది చూడగానే వాళ్ల ముగ్గురు ఆ పాడుబడ్డ ఇంటిని 30 నిమిషాల్లోనే విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో చోటు చేసుకుంది. ఆ ముగ్గురూ వెంటనే 911కి కాల్ చేసి అధికారులను పిలిచారు. పోలీసులు, అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా.. అసలేం జరిగిందో వారు వివరించారు.
ఆ వ్యక్తి భవనం నుంచి కొంత స్క్రాప్ మెటల్‌ను బయటకు తీసే క్రమంలో అతడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. కాస్కెట్ లిఫ్ట్‌ను విడదీసే క్రమంలో.. అది కూలిపోయి అతడు నుజ్జునుజ్జయ్యాడని విచారించారు. కాగా, సదరు మహిళ 2022లో పాడుబడ్డ ఇంటిని సందర్శించగా.. దానికి సంబంధించిన వీడియో మళ్లీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఇది చదవండి: కడుపు ఉబ్బి.. చిత్రవిచిత్ర శబ్దాలతో ఆస్పత్రికి.. భయంతో ఎక్స్‌రే తీయగా.. అందులో పొడవైన
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
