AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారణాసిని వణికిస్తున్న దెయ్యం.. రంగంలోకి దిగిన పోలీసులు

రకరకాల ఎడిట్స్ తో.. గ్రాఫిక్స్ తో.. ఇదిగో దెయ్యం.. అదిగో దెయ్యం అంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటారు కొందరు.

Viral Video: వారణాసిని వణికిస్తున్న దెయ్యం.. రంగంలోకి దిగిన పోలీసులు
Ghost
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2022 | 1:08 PM

Share

దెయ్యం అంటే భయపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు.. దెయ్యం భయంతో ఊర్లు ఖాళీచేసి వెళ్లిపోయే జనాలు కూడా ఉన్నారు. ఇక దెయ్యాల పేరు చెప్పుకొని డబ్బులు దండుకునే వాళ్ళు, జనాలను భయపెట్టే వాళ్లు సైతం ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దెయ్యాలు సంబందించిన వీడియోలకు కొదవే లేదు. రకరకాల ఎడిట్స్ తో.. గ్రాఫిక్స్ తో.. ఇదిగో దెయ్యం.. అదిగో దెయ్యం అంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటారు కొందరు. తాజాగా ఓ దెయ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దాంతో అక్కడి స్థానికులు భయంతో వణికిపోయారు. దాంతో ఈ వీడియో పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి దర్యాప్తు మొదలు పెట్టారు.

వారణాసిలో ఓ ఇంటి పై తెల్లటి ముసుగు వేసుకొని ఎవరో తిరగడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో పై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో భేలుపూర్ పోలీసులు అసలు విషయం కనిపెట్టే పనిలో పడ్డారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. కొద్దిరోజుల క్రితం బడి గబీ ప్రాంతంలోని వీడీఏ కాలనీలో  దెయ్యం కనిపించిందని ఓ వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారడంతో గందరగోళం నెలకొంది. ఆ వీడియోలో ఓ తెల్లటి ముసుగుతో ఎదో నడుస్తూ కనిపించింది. ఆ తర్వాత.. ఇలాంటి మరో మూడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమంది స్థానికులు ఈ వీడియో నిజమైంది అంటుంటే.. మరికొందరు ఇది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వాస్తవికతను ధ్రువీకరించలేదు 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్