Viral Video: గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్ముకున్నాడు.. కట్ చేస్తే.. ఏకంగా బ్రిడ్జిపైకి ఎక్కించాడు..
తమకు తెలియని ప్లేస్‌కు వెళ్లాలనుకునే చాలామంది జనాలు గూగల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్ముకుని రోడ్డెక్కుతారు.
ప్రస్తుతమంతా ఆధునిక యుగం నడుస్తోంది. నాడు అడ్రెస్ కోసం ఎవరినైనా అడిగి వెళ్లేవారు.. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వారి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారు. తమకు తెలియని ప్లేస్‌కు వెళ్లాలనుకునే చాలామంది జనాలు గూగల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్ముకుని రోడ్డెక్కుతారు. అలాగే ఈ వ్యక్తి కూడా గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని ప్రయాణం చేశాడు.. ఏకంగా తన అటోని.. అందుకు సంబంధించిన వైరల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ అటో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. పాపం! ఆ అటో డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని ఉంటాడు. యూటర్న్ తీసుకోవాల్సిందిపోయి.. ఏకంగా తన అటోను ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కించేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుండగా.. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోను చూసేయండి.
When Google Maps shows you to take the bridge pic.twitter.com/JfyShdiPzS
— Rajabets India??? (@smileandraja) August 18, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..