Viral Video: అక్కా జర జాగ్రత్త.! ఎస్కలేటర్ ఇలా కూడా ఎక్కుతారా.. వీడియో చూస్తే నవ్వులే..
ఇద్దరమ్మాయిలు ఎస్కలేటర్ ఎక్కబోతున్నట్లు మీరు చూడవచ్చు. ఎస్కలేటర్ అంటే వారికి భయమో..
ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ వీడియోలకు కొదవ ఉండదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. దాన్ని చూశాక మీరు కూడా నవ్వడం ఖాయం.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరమ్మాయిలు ఎస్కలేటర్ ఎక్కబోతున్నట్లు మీరు చూడవచ్చు. ఎస్కలేటర్ అంటే వారికి భయమో.. లేక అదే ఫస్ట్ టైమో తెలియదు గానీ.. ఇద్దరూ దాన్ని ఎక్కాలా.. వద్దా.. అని అలోచించి.. అలోచించి.. చివరికి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని.. ఎక్కుతారు. అంతే! వాళ్లు అనుకున్నది ఒక్కటైతే.. అక్కడ జరిగింది మరొక్కటి.. ఇద్దరూ కూడా స్లిప్ అయ్యి కింద పడతారు. వెనుకున్న వ్యక్తి ఆ ఇద్దరమ్మాయిలకు సహాయపడటంతో కథకు ఎండ్ కార్డు పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోను ‘bhutni_ke_memes’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అక్కా జర జాగ్రత్త.!’ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేయగా.. ‘ఎస్కలేటర్ ఇలా కూడా ఎక్కుతారా.. అక్కా!’ అంటూ మరికొందరు రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..