AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ ఏనుగు పిల్లకు పట్టరాని సంతోషం వచ్చింది.. రచ్చ రచ్చ చేసింది

జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు జంతువులు చేసే పనులు భలే విచిత్రంగా ఉంటాయి.

Viral Video: ఈ ఏనుగు పిల్లకు పట్టరాని సంతోషం వచ్చింది.. రచ్చ రచ్చ చేసింది
Elephant
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2022 | 8:02 PM

Share

Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు జంతువులు చేసే పనులు భలే విచిత్రంగా ఉంటాయి. అవి చేసే పనులు చూస్తే నవ్వొస్తుంది. కొన్ని సార్లు మాత్రం వణుకు పుట్టిస్తాయి. ఇక అవి అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తూ ఉంటాయి. మనలో చాలా మంది సంతోషం వస్తే ఒళ్ళు తెలియకుండా ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ ఏనుగు పిల్ల చేసిన పని ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఎంత సంతోషం కలిగిందో అంతలా డాన్స్ చేసింది ఈ గున్న ఏనుగు .

తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ ఏనుగు పిల్ల డాన్స్ చేయడం మనం చూడొచ్చు. రెండు పెద్ద ఏనుగులతో రోడ్డు మధ్యలో ఓ పిల్ల ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది తాజా సెట్టింగ్‌లు క్రుగర్ ఖాతా ద్వారా ఫేస్ బుక్ నుండి షేర్  చేయబడిన వీడియో. ఇది దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్ లో జరిగింది. రియా క్రిట్జింగర్ ఈ అందమైన వీడియోను చిత్రీకరించారు. ఎంతో ఆనందంతో రోడ్డు పైకి వచ్చి ఏనుగు పిల్ల డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఏనుగు పూర్తి పరిపక్వతకు చేరుకోవడానికి 16 సంవత్సరాలు పడుతుంది. కానీ ఏనుగు 20 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. పూర్తిగా పెరిగిన ఏనుగు రోజుకు 400 కిలోల ఆహారాన్ని , సగటున 150 లీటర్ల నీటిని తీసుకుంటుంది. ఇవి సగటున 20-21 అడుగుల పొడవు, 6-12 అడుగుల ఎత్తు మరియు 5000 కిలోగ్రాముల వరకు బరువు ఉంటాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి