Optical Illusion Personality Test: ఈ ఫోటోలో ముందుగా మీరు చూసేది ప్రేమలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన తెలుపుతుంది..
"మన ఆలోచన, మన పాట" అనే పేరుతో రూపొందించబడిన ఈ అద్భుతమైన కళాఖండంలో ఒక చిత్రకారుడు, చెట్టు పక్కన నిలబడి ఉన్న స్త్రీ, మీసాలు ఉన్న వ్యక్తి, మీసాలు లేని వ్యక్తి, కొన్ని ఇళ్ళు , సంగీత వాయిద్యం ఉన్నాయి.
ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అంటే విభిన్న రూపాలను కలిగి ఉండి.. విభిన్నంగా గ్రహించగలిగే చిత్రం. భౌతిక, శారీరక, అభిజ్ఞా భ్రమలు వంటి అనేక రకాల ఆప్టికల్ భ్రమలు ఉన్నాయి. ఇవి చాలా సందర్భాల్లో మనిషి వ్యక్తిత్వాన్ని.. ఆలోచన తీరును తెలియజేస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా మానసిక విశ్లేషణ రంగంలో ఉపయోగిస్తారు. మనం చూసే వస్తువు,చిత్రాన్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కళాకారుడు ఒలేగ్ షుప్లియాక్ రూపొందించిన పాత ఆప్టికల్ ఇల్యూషన్ పెయింటింగ్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. పైన చూస్తున్నారు కదా.. ఇది మన ప్రవర్తన గురించి తెలుపుతుంది. అలాగే బంధాలలో మనం ఎలా ప్రవర్తిస్తాము.. ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామో తెలియజేస్తుంది.
“మన ఆలోచన, మన పాట” అనే పేరుతో రూపొందించబడిన ఈ అద్భుతమైన కళాఖండంలో ఒక చిత్రకారుడు, చెట్టు పక్కన నిలబడి ఉన్న స్త్రీ, మీసాలు ఉన్న వ్యక్తి, మీసాలు లేని వ్యక్తి, కొన్ని ఇళ్ళు , సంగీత వాయిద్యం ఉన్నాయి. పెయింటింగ్‌ను చూసేటప్పుడు మీకు ముందుగా కనిపించే వ్యక్తి లేదా ముఖం ప్రేమలో పడినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారనే దాని గురించి చాలా చెబుతుందని పేర్కొన్నారు.
చిత్రకారుడు.. మీరు ముందుగా పెయింటర్, అతని సబ్జెక్ట్ చూస్తే.. మీరు ప్రేమలో పడినప్పుడు మీ భాగస్వామిపై లేజర్ దృష్టిని పెడుతున్నారని అర్థం. మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీ ప్రియురాలి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వారి కోసం మీ ప్రేమను ఎక్కువగా ఇస్తారు. కేర్ తీసుకుంటారు. ఇది కొన్నిసార్లు చాలా ఒత్తిడిని కలిగిస్తుంది
మీసాలు లేని వ్యక్తి.. మీరు ముందుగా మీసాలు లేని వ్యక్తిని చూస్తే.. మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఎక్కువ ఆత్మపరిశీలన చేసుకుంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీరు విభిన్న భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీ ఆలోచనలు ఒంటరిగా ఉండేందుకు మారితో మీ భాగస్వామిని గందరగోళానికి గురిచేసే ప్రమాదం ఉంది. మీ విషయంలో ప్రతిదీ నియంత్రణలో ఉండాలి.
మీసాలు ఉన్న వ్యక్తి.. ముందుగా మీరు మీసాలు ఉన్న వ్యక్తిని చూసినట్లయితే మీరు ప్రేమలో పడిన వెంటనే ఓ ఇంటివారవుతారు. మీ రిలేషన్ షిప్ లో లేనప్పుడు ఎలాంటి రూల్స్ లేకుండా స్వేచ్చగా ఉంటారు. కానీ ఎవరినైనా ఇష్టపడిన తర్వాత మీకు కుటుంబం, ఇంటి ప్రాముఖ్యత గురించి తెలుస్తోంది.
చెట్టు పక్కన ఉన్న స్త్రీ.. చెట్టు పక్కన నిలబడి ఉన్న స్త్రీని చూస్తే.. మీరు ప్రతిదానిలో లోతుగా ఆలోచిస్తున్నారని అర్థం . మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీ ఆలోచనలను పంచుకోవడానికి .. మీ విషయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు జాగ్రత్తలు పాటించాలి.
గృహాలు.. మీరు ఇళ్లు చూసినట్లయితే ప్రేమలో ఉన్నప్పుడు భవిష్యత్తుపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. మీరు సాధారణంగా ప్లానర్ కానప్పటికీ సంబంధాలు మిమ్మల్ని భవిష్యత్తు గురించి ఆలోచించేలా.. ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తాయి.
సంగీత వాయిద్యం.. మీరు ముందుగా సంగీత వాయిద్యం చూస్తే.. మీరు ప్రేమలో ఉన్నప్పుడు మరింత సృజనాత్మకంగా మారారని అర్థం. కొత్త అనుభవాలను పంచుకోవడానికి ఆనందించండి. అలాగే.. మీ కళాత్మక విధానాన్ని, కళ, సంస్కృతిని అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు.