ప్రస్తుతం ఉన్నదంతా ఆధునీక ప్రపంచం.. పెరిగిన పోయిన సాంకేతికత, విజ్ఞానంతో పాటు మరణాయుధాలైన తుఫాకులు, బాంబులు, గన్‌ల తయారీ, వినియోగం ట్రెండ్‌కు తగినట్టుగానే మారిపోయాయి. అయితే, నేడు మార్కెట్లోకి అత్యాధునీక తుఫాకులు, మెషిన్ గన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి కూడా టార్గెట్ చేసిన ఏరియాపై దాడి చేసే అవకాశం ఉంది. చిన్న బటన్ నొక్కితే చాలు భారీ విధ్వంసం చేసే ఆయుధాలు మార్కెట్లోకి వచ్చేశాయి. అయితే, ఒక్కో తుపాకీ, గన్‌లోంచి వచ్చే బుల్లెట్లు వేర్వేరు వేగంతో ఉంటాయి. వాటి నుండి పేలిన బుల్లెట్ సౌండ్ వేగం కంటే వేగంగా దూసుకెళ్లే బుల్లేట్లు కూడా చాలా ఉన్నాయి. అంటే, బుల్లెట్ సౌండ్ మీ చెవులకు చేరే సమయానికి, మీరు అప్పటికే దాని బాధితులుగా మారపోతారు. అయితే గన్ బుల్లెట్ సగటు వేగం ఎంత అని అడిగితే మీ సమాధానం ఏమిటి? బుల్లెట్ల వేగం తుపాకీ రూపకల్పన, దాని బారెల్ పొడవుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తుపాకీ నుండి కాల్చే బుల్లెట్ సగటు వేగం సెకనుకు 2500 అడుగులుగా పరిగణించబడుతుంది. మరో విషయం ఏమిటంటే, చాలా మంది తుపాకీ, రైఫిల్ ఒకేలా భావిస్తారు. అయితే అది వాస్తవం కాదు. తుపాకీ బుల్లెట్ వేగం రైఫిల్ కంటే తక్కువ. 303 అంటే మీరు త్రి నాట్ త్రి అని పిలుస్తారు. దాని నుండి కాల్చిన బుల్లెట్ సగటు వేగం సెకనుకు 2440 అడుగులు.
గన్ పేలిన సౌండ్ కంటే ముందే.. బుల్లెట్ మిమ్మల్ని చేరుకుంటుంది… సాధారణంగా ఉపయోగించే రైఫిల్‌లో అత్యధిక వేగం 223 బోర్ రెమింగ్టన్ రైఫిల్ జాకెట్డ్ బుల్లెట్. దీని బుల్లెట్ సెకనుకు 3240 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ. ధ్వని వేగం సెకనుకు 1100 అడుగులుగా పరిగణించబడుతుంది. తుపాకీ శబ్దం మీ చెవులను చేరే సమయానికి బుల్లెట్ మీ శరీరంలోకి దూసుకెళ్తుంది..
INSAS రైఫిల్ నుండి పేల్చిన బుల్లెట్ వేగం..
సెకనుకు 2500 అడుగులు. 7.62 mm SLR బుల్లెట్ వేగం సెకనుకు 2440 అడుగులు. రివాల్వర్, పిస్టల్ పరిధి 50 నుండి 100 మీటర్లు మాత్రమే. అయితే అసాల్ట్ రైఫిల్ పరిధి 100 నుండి 400 మీటర్లు. ఇక తుపాకుల విషయానికి వస్తే.. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా తెలిపిన వివరాల ప్రకారం 09 mm హ్యాండ్‌గన్ అత్యంత ప్రమాదకారిగా గుర్తింపుపొందింది.దాని నుండి వెలువడిన బుల్లెట్ 2130 గజాల వరకు అంటే 1.2 మైళ్ల దూరం వరకూ వెళ్లగలదు.ఇది ఉపయోగించే తుపాకీ బారెల్ పొడవుపై కూడా ఆధారపడి ఉంటుంది.
09 mm హ్యాండ్‌గన్ పేల్చిన వెంటనే సెకనుకు 955 అడుగుల వేగంతో దూసుకెళ్తుంది.. అంటే ధ్వని వేగం సెకనుకు 1100 అడుగులకు సమానం. 10 మి.మీ చేతి తుపాకీ వేగం సెకనుకు 1425 అడుగులుగా అంచనా వేయబడింది. కోల్ట్ 45 పోలీసు రివాల్వర్ వేగం సెకనుకు 920 అడుగులు కాగా, ఏకే 47 రైఫిల్ సెకనుకు 2300 అడుగులు.
ఆధునిక హ్యాండ్‌హెల్డ్ తుపాకీల నుండి కాల్చే బుల్లెట్‌లు సెకనుకు దాదాపు 500 అడుగుల నుండి సెకనుకు 4,000 అడుగుల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. సెకనుకు 500 అడుగులు అంటే నిమిషానికి 30000 అడుగులు (సుమారు ఐదున్నర మైళ్లు), గంటకు 1,800,000 అడుగులు (సుమారు 341 మైళ్లు). సెకనుకు 4,000 అడుగుల వేగం దాని ఎనిమిది రెట్లు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..