AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kothagudem: ఆదర్శం ఆ అధికారి.. కోతులను తరిమికొట్టేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి తన పంచాయతీని పట్టిపీడిస్తున్న కోతుల దాడిని పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ ఆలోచన ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తోంది. రాష్ట్రంలోని పలు గ్రామాలు, పట్టణాల మాదిరిగానే బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ గ్రామపంచాయతీలోనూ కోతుల గుంపు ఇళ్ల చుట్టూ తిరుగుతూ

Kothagudem: ఆదర్శం ఆ అధికారి.. కోతులను తరిమికొట్టేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం
Viral News
Balu Jajala
|

Updated on: Mar 27, 2024 | 10:11 PM

Share

కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి తన పంచాయతీని పట్టిపీడిస్తున్న కోతుల దాడిని పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ ఆలోచన ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తోంది. రాష్ట్రంలోని పలు గ్రామాలు, పట్టణాల మాదిరిగానే బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ గ్రామపంచాయతీలోనూ కోతుల గుంపు ఇళ్ల చుట్టూ తిరుగుతూ మొక్కలను ధ్వంసం చేయడం, తినుబండారాలను లాక్కోవడం, పంట పొలాల్లోని పంటలను ధ్వంసం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి బెందాడి భవానీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, వారు సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగారు. అప్పుడే ఆమెకు యూట్యూబ్ లో కొన్ని వీడియోలను చూడటంతో ఓ ఐడియా వచ్చింది. ఆన్ లైన్ లో గొరిల్లా దుస్తులు కొనుక్కుని రెండుసార్లు గ్రామం, వ్యవసాయ పొలాల్లో  తిరిగింది. కోతులు ‘గొరిల్లా’కు భయపడి సమీపంలోని అడవుల్లోకి పారిపోవడంతో ఈ ఆలోచన ఫలించింది. గత వారం రోజులుగా ఈ ఆలోచనను అమలు చేస్తున్నామని, చాలా వరకు కోతులు గ్రామాన్ని వదిలి వెళ్లాయని, కొన్ని మాత్రం అక్కడక్కడా తిరుగుతున్నాయని తెలిపారు.

గొరిల్లా దుస్తులు ధరించిన కార్మికుడు మరో సిబ్బందితో కలిసి కోతులు గుమిగూడే ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఊరి నుంచి వెళ్లిపోయిన కోతులు తిరిగి రాకుండా చూస్తున్నాడు. ప్రస్తుతం వీరి ప్రయత్నం ఫలించి కోతల బెడదను దూరం చేసింది.