Viral Video: పట్టపగలు బ్యాంకును దోచేసిన దొంగలు.. వైరల్‌ అవుతోన్న వీడియో..

తుపాకులతో బ్యాంకులోకి వచ్చిన దుండగులు హల్చల్‌ చేశారు. దీంతో ఒక్కసారి నివ్వెరపోయిన బ్యాంకు ఉద్యోగులు రెండు చేతులు పైకెత్తి నిలబడ్డారు. బ్యాంకు ఉద్యోగులను చంపుతామంటూ బెదిరించి రూ. 10 లక్షలు దోచుకొని పోయారు. ఇదంతా బ్యాంకులో ఉన్న సిసిటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ శ్యోజీలాల్ మీనా బలగాలతో సంఘటనా...

Viral Video: పట్టపగలు బ్యాంకును దోచేసిన దొంగలు.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 27, 2024 | 7:24 PM

బ్యాంకు దోపీడీలను మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. మాస్కు ధరించిన దొంగ ఉన్నపలంగా బ్యాంకులోకి చొరబడి, గన్‌తో బెదిరించి అందినకాడికి పట్టుకుపోతాడు. అయితే అచ్చంగా ఇలాంటి ఓ సన్నివేశమే నిజ జీవితంలోనూ జరిగింది. రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాకు చెందిన యూకో బ్యాంక్‌లో పట్టపగలే దొంగలు బ్యాంకును దోచేశారు. బుధవారం మధ్యాహ్నం బార్‌గావ్‌ ప్రాంతంలో ఇద్దరు దుండగులు ముసుగుల ధరించి బ్యాంకులోకి చొరబడ్డారు.

తుపాకులతో బ్యాంకులోకి వచ్చిన దుండగులు హల్చల్‌ చేశారు. దీంతో ఒక్కసారి నివ్వెరపోయిన బ్యాంకు ఉద్యోగులు రెండు చేతులు పైకెత్తి నిలబడ్డారు. బ్యాంకు ఉద్యోగులను చంపుతామంటూ బెదిరించి రూ. 10 లక్షలు దోచుకొని పోయారు. ఇదంతా బ్యాంకులో ఉన్న సిసిటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ శ్యోజీలాల్ మీనా బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.

దుండగులు బ్యాంకులో రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే సుమారు రూ. 10.75 లక్షలను దోచుకున్నారు. దుండగులిద్దరూ బైక్‌పై వచ్చినట్లు ఎస్‌హెచ్‌వో రాజేంద్ర ప్రతాప్ తెలిపారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. బ్యాంకు నుంచి బయటకు వచ్చిన దుండగులు బైక్‌పై పారిపోయారు. బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!