Viral Video: ఏంటి మావ ఇలా ఉన్నావ్.. పెళ్లికూతురితో ఫొటోషూట్.. వరుడు ఏం చేశాడో తెలుసా..
ఒక పెద్ద, హై ప్రొఫైల్ వివాహం.. అంతా సందడిగా ఉంది.. వధూవరుల ఫొటో షూట్ నడుస్తుండగా.. చిన్నారులు ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.. ఇంతలో చిరాకు పడ్డ పెళ్లి కొడుకు పెళ్లిలో వింత ప్రకటన చేశాడు.. "మీ దగ్గర డబ్బు లేకపోతే, నా దగ్గర తీసుకోండి", అంటూ చెప్పడం అతిథులను ఆశ్చర్యపరచడంతోపాటు.. ఇంటర్నెట్‌లో కలకలం రేపింది.

పెళ్లంటే.. మామూలు హడావుడి కాదు.. ఈ రోజుల్లో పెళ్లిళ్లు కేవలం ఆచారాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా.. మెగా ఫిల్మ్ సెట్‌ని పోలి ఉంటున్నాయి. వధువు దుపట్టా నుంచి.. వరుడి సెహ్రా.. వేసుకునే దుస్తులు.. ధరించే నగల వరకు ప్రతిదీ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండాల్సిందే.. అంతేకాకుండా పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత షూట్‌లకు ప్రజలు పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్నట్లుగా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ ప్రతి సెట్‌లో కొన్ని అనవసర పాత్రలు కూడా తెరపైకి వస్తాయి.. కొన్ని సందర్భాల్లో.. చిన్న పిల్లలు.. చిన్నారులు ఏ క్షణంలోనైనా అకస్మాత్తుగా ఫ్రేమ్‌లోకి ప్రవేశించి మొత్తం సన్నివేశాన్ని చెడగొట్టే అవకాశం ఉంటుంది.. పెళ్లి లాంటి వేడుకల్లో చిన్నారులను మేనెజ్ చేయడం కొంచెం కష్టమైన పనే.. వీరు.. ఏ సందర్భంలో ఏం చేస్తారో .. అనేది పసిగట్టలేం.. తాజాగా.. పెళ్లి వేడుకలో చిన్నారులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక పెద్ద, హై ప్రొఫైల్ వివాహం షూట్ సమయంలో చిన్నారులు ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.. వధూవరులిద్దరూ ప్రత్యేక కరెన్సీ షవర్ షాట్ కోసం వేదికపైకి సిద్ధంగా ఉన్నారు. కెమెరాలు సెట్ చేసి.. లైట్లు ఆన్ చేశారు.. పై నుండి నోట్ల వర్షం కురుస్తోంది. ప్రతిదీ బాలీవుడ్ రొమాంటిక్ పాటలాగా ప్లే అయింది. అప్పుడే అకస్మాత్తుగా.. చిన్న పిల్లలు సన్నివేశంలోకి ప్రవేశించారు. ఈ పిల్లలు కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతున్నట్లు చూసిన వెంటనే, వారు వెంటనే వేదిక వైపు పరిగెత్తి.. డబ్బులు తీసుకుంటూ కనిపించారు. వధూవరుల రొమాంటిక్ షాట్ కు బదులుగా, పిల్లలు డబ్బు కోసం వేటాడే ప్రత్యక్ష ప్రదర్శన ప్రారంభమైంది.. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అయితే.. ఇదంతా చూసిన వెంటనే, వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. కోపంగా ఉన్న వరుడు మొదట పిల్లలను తిట్టి, అక్కడి నుంచి పంపించాడు.. ఆవేశంలో ఓ అబ్బాయిని కూడా కొట్టాడు..
వీడియో చూడండి..
View this post on Instagram
మైక్రోఫోన్‌లో అతను చెప్పిన మాటలు వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. “మీకు డబ్బు సమస్య ఉంటే, వచ్చి మా నుండి తీసుకోండి, కానీ దయచేసి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మా షూట్‌ను నాశనం చేయవద్దు” అని అతను కోరాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. అయితే.. ఆ వీడియోకు చాలా కామెంట్లు వచ్చాయి. కొంతమంది వరుడి కోపం పూర్తిగా సమర్థనీయమని భావించగా.. మరికొందరు.. గ్రాండ్‌గా వివాహాలు నిర్వహించి, అతిథులను అవమానించడం కరెక్ట్ కాదంటూ రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




