AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోవద్దు.. ఈ వ్యాధికి సంకేతం కావొచ్చు..!

ఫ్యాటీ లివర్ అనేది ఒక కాలేయ వ్యాధి.. దీని ప్రారంభ లక్షణాలను విస్మరించకూడదు. ఫ్యాటీ లివర్ కు సకాలంలో చికిత్స చేయకపోతే, అది తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రారంభంలో లక్షణాలు అంతగా కనిపించకపోవచ్చని పేర్కొంటున్నారు. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

శరీరంలో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోవద్దు.. ఈ వ్యాధికి సంకేతం కావొచ్చు..!
Fatty Liver
Shaik Madar Saheb
|

Updated on: Nov 29, 2025 | 10:20 AM

Share

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. వాటిలో ఒకటి ఫ్యాటీ లివర్ సమస్య. కాలేయంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే.. అది లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

చాలా మంది ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలను విస్మరిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి ప్రమాదకరం.. సకాలంలో చికిత్స చేయకపోతే ఫ్యాటీ లివర్ తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం.. కొన్ని లక్షణాలను గమనించినట్లయితే.. ఇంట్లోనే ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

నాభి దగ్గర కొవ్వు పేరుకుపోవడం: ఉదరం మధ్యలో కొవ్వు పెద్ద పరిమాణంలో పేరుకుపోతే అది ఫ్యాటీ లివర్ లక్షణం. ఇన్సులిన్ నిరోధకత కారణంగా ఫ్యాటీ లివర్ సమయంలో ఉదరం మధ్యలో నల్లటి గీతలు కూడా ఏర్పడతాయి.

నీరసం: మీరు చాలా సేపు అలసిపోయినట్లు అనిపిస్తే, అది ఫ్యాటీ లివర్ కు సంకేతం కావచ్చు. కాలేయం పోషకాలను ప్రాసెస్ చేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఫ్యాటీ లివర్ సంభవించినప్పుడు, శరీరంలో విషాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.. ఇది అలసటకు దారితీస్తుంది.

కుడి పక్కటెముకల దగ్గర నొప్పి: దిగువ కుడి పక్కటెముకలో భరించలేని నొప్పి లేదా అసౌకర్యం ఎదురైతే జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్యాటీ లివర్ లక్షణం. కుడి పక్కటెముక నొప్పిని విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

చర్మ సమస్యలు: ఫ్యాటీ లివర్ సమయంలో చర్మ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. దీనితో పాటు, జుట్టు రాలడం కూడా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు కూడా ఫ్యాటీ లివర్ లక్షణాలు..

వికారం: వికారం – ఆకలి లేకపోవడం ఫ్యాటీ లివర్ లక్షణాలు కావచ్చు. మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఫ్యాటీ లివర్ ఆకలిని తగ్గిస్తుంది.

మీరు ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..