Viral Video: వధూవరులను ఫోటో తీయాలనుకుంది.. కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్.. దెబ్బకు అంతా షాక్!
పెళ్లంటేనే చాలు.. కుటుంబమంతా సందడి వాతావరణం చోటు చేసుకుంటుంది. పెళ్లిలో జరిగే ఇన్సిడెంట్స్ కొన్ని నవ్వు తెప్పిస్తే..

పెళ్లంటేనే చాలు.. కుటుంబమంతా సందడి వాతావరణం చోటు చేసుకుంటుంది. పెళ్లిలో జరిగే ఇన్సిడెంట్స్ కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఫ్రెండ్స్ అల్లరి చేష్టలు, అమ్మలక్కల కబుర్లు.. ఇలా మ్యారేజ్‌లో ఎక్కడలేని ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. ఇంటర్నెట్‌లో పెళ్లి వీడియోలు కోకొల్లలు. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాన్ని చూస్తే మీకు అస్సలు నవ్వాగదు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి వేడుకలో వధూవరులను ఓ మహిళ ఫోటోలు తీయాలనుకుంది. కాలువ ఉందని చూడకుండా.. ఫోటోలు తీసే క్రమంలో వెనక్కి నడుస్తుంది సదరు మహిళ. అంతే! ఒక్కసారిగా అక్కడున్న మురికి కాలువలోకి పడిపోతుంది. పక్కనున్నవారంతా ఆమెను కాలువలో నుంచి బయటికి తీస్తారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇంటర్నెట్‌లో మాత్రం తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో ఫోటోలు తీయడమే కాదు.. చుట్టుప్రక్కల కూడా గమనిస్తూ ఉండాలని నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి..
View this post on Instagram
