Viral: వామ్మో! ఏం ధైర్యం సామీ.. 10 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాకు ఇట్టే స్నానం చేయించేశాడుగా!
వివిధ జాతుల పాముల్లో కింగ్ కోబ్రా, త్రాచు పాము అత్యంత ప్రమాదకరమైనవి.. ఒక సంవత్సర కాలంలో..
అత్యంత భయంకరమైన సరీసృపాల్లో పాములు ఒకటి. వివిధ జాతుల పాముల్లో కింగ్ కోబ్రా, త్రాచు పాము అత్యంత ప్రమాదకరమైనవి పరిగణిస్తారు. ఒక సంవత్సర కాలంలో సుమారు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది పాము కాటుకు బలవుతున్నారని డబ్ల్యూహెచ్‌వో నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొందరు పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనుకుంటారు. మరికొందరు వాటితోనే సావాసం చేస్తారు. ఆ జాబితాలో స్నేక్ క్యాచర్స్, సరీసృపాల జూ టేకర్స్ ఉండగా.. వీరి జీవితం ఎప్పుడూ చావుతో చెలగాటమే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా ఓల్డ్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో మరోసారి వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. సరీసృపాల కేర్ టేకర్.. కింగ్ కోబ్రా, త్రాచుపాములను వాటి బాక్స్‌ల నుంచి బయటికి తీసి నీటితో నిండిన ఓ టబ్‌లో వేసి స్నానం చేయిస్తున్నట్లు మీరు చూడవచ్చు. అవి రెండూ కూడా భారీ సైజ్‌లో ఉండగా.. అతడు ఏమాత్రం బెదరకుండా ఆ రెండు విషసర్పాలకు స్నానం చేయిస్తున్నాడు. ఆ సమయంలో ఏమాత్రం తేడా జరిగినా.. అతడి ప్రాణానికే ప్రమాదం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..