బాహుబలి ఫైట్ సీన్ రిపీట్.. మేకల మందపై కోతి ఫీట్లు.. ప్రభాస్ ఫైట్‏ను తలపించిన సీన్

|

Jun 08, 2023 | 12:04 PM

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా ఆవుల మందపై దూకుతూ హీరో ప్రభాస్ ముందుకు వెళ్ళే ఫైట్ సీన్ మామూలుగా ఉండదు..! అచ్చంగా అలాంటి సీనే రిపీట్ అయింది కానీ.. ఈ సీన్లో హీరో ప్రభాస్ కాదు ఓ కోతి అంటే నమ్ముతారా..? అదేంటి అనుకుంటున్నారా ఇదిగో ఈ వీడియో చూడండి.

బాహుబలి ఫైట్ సీన్ రిపీట్.. మేకల మందపై కోతి ఫీట్లు.. ప్రభాస్ ఫైట్‏ను తలపించిన సీన్
Bahubali Goat 02
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా ఆవుల మందపై దూకుతూ హీరో ప్రభాస్ ముందుకు వెళ్ళే ఫైట్ సీన్ మామూలుగా ఉండదు..! అచ్చంగా అలాంటి సీనే రిపీట్ అయింది కానీ.. ఈ సీన్లో హీరో ప్రభాస్ కాదు ఓ కోతి అంటే నమ్ముతారా..? అదేంటి అనుకుంటున్నారా ఇదిగో ఈ వీడియో చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఆటో యజమాని బండారు విజయ్ కుమార్ ఆటోలో కిరాయికి వెళ్లి వస్తుండగా,ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మేకల మందపై బాహుబలి స్టయిల్ లో ఫీట్లు చేస్తున్న కోతి కనిపించడంతో ముచ్చటపడి తన సెల్ ఫోన్ లో వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు.

ఈ కోతి చేష్టలు చూసిన వారు ఓరిని ఏషాలో అనుకుంటూ నవ్వుతున్నారు. అయితే తాటియాకులగూడెం గ్రామం నుండి రోజు మేత కోసం అడవిలోకి వెళ్లి వచ్చే మేకల మందకు కోతి పరిచయమైంది. అప్పటినుండి మేకలతోనే ఉంటూ వాటి పైనే పెత్తనం చెలాయిస్తూ ఇదిగో ఇలా రాజసం వెళ్లబడుతుంది. ఆ మేకల కాపరి కూడా కోతిని చేరదీయడంతో వాళ్లతోనే ఉంటుంది.

Byline: (నారాయణ రావు, టీవీ9 ఖమ్మం రిపోర్టర్)