Watch Video: లక్ష్మీ దేవి దూతనా ఏంటి?.. నడిరోడ్డుపై నోట్ల వర్షం.. అంతలోనే మాయం..!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఫ్లై ఓవర్ పై నుంచి నోట్ల వర్షం కురిసింది. ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి సంచిలోంచి నోట్లను తీసి ఫ్లై ఓవర్‌పై నుంచి విసిరేశాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఫ్లై ఓవర్ పై నుంచి నోట్ల వర్షం కురిసింది. ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి సంచిలోంచి నోట్లను తీసి ఫ్లై ఓవర్‌పై నుంచి విసిరేశాడు. ఆ నోట్లను తీసుకునేందుకు జనాలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఇందకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఆ నోట్లను ఎవరు విసిరారు? ఎందుకు విసిరారు? ఎక్కడ జరిగిందీ ఘటన వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బెంగళూరులో కేఆర్ ఫ్లై ఓవర్‌పై నోట్ల వర్షం కురిసింది. ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి 10రూపాయల నోట్ల వర్షం కురిపించాడు. మెడలో గడియారాన్ని ధరించి వచ్చిన ఆ వ్యక్తి..బ్యాగ్‌లో నుంచి నోట్లను తీసి ఫ్లై ఓవర్ పై నుంచి కిందికి విసిరాడు. ఆ నోట్ల కోసం స్థానికులు ఎగబడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఈ విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆ వ్యక్తి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలించి, గుర్తించారు. కరెన్సీ నోట్లను వెదజల్లింది అరుణ్ అనే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అయితే, ఆ వ్యక్తి ఎందుకలా డబ్బును వెదజల్లాడు అనేది ఇంకా తెలియలేదు. ఇదే అంశంపై అతన్ని విచారిస్తున్నారు పోలీసులు.
అయితే, ఫ్లై ఓవర్ కింద నోట్లను ఏరుకుంటున్న జనాలు, డబ్బును విసురుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వ్యక్తి చూడటానికి సూటుబూటు తో క్లాస్‌గా ఉండి, మెడలో గడియారం తగిలించుకుని ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డబ్బులు సేకరించిన వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ, అతను అలా ఎందుకు చూశాడా? అని వీడియో చూసిన వారు తెగ ఆలోచించేస్తున్నారు. ఈ మేరకు వీడియోలకు కామెంట్స్ పెడుతున్నారు.
వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..