Viral Video: డాక్టర్లను దేవుళ్లనేది ఇందుకేనేమో.. ఆగిపోయిన గుండెను కదిలించిన వైద్యుడు.. సీసీటీవీలో రికార్డైన వీడియో..

Viral Video: వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తుంటాం. మనిషి ప్రాణాన్ని రక్షించే శక్తి ఒక్క డాక్టర్లకు మాత్రమే ఉంటుందని కొనియాడుతుంటాం. అందుకే వైద్య వృత్తిని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన...

Viral Video: డాక్టర్లను దేవుళ్లనేది ఇందుకేనేమో.. ఆగిపోయిన గుండెను కదిలించిన వైద్యుడు.. సీసీటీవీలో రికార్డైన వీడియో..
Heart Attack
Follow us
Narender Vaitla

| Edited By: Basha Shek

Updated on: Sep 06, 2022 | 6:24 AM

Viral Video: వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తుంటాం. మనిషి ప్రాణాన్ని రక్షించే శక్తి ఒక్క డాక్టర్లకు మాత్రమే ఉంటుందని కొనియాడుతుంటాం. అందుకే వైద్య వృత్తిని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన వైద్యుల గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరణం అంచుల వరకు వెళ్లిన ఓ వ్యక్తిని వైద్యుడు బతికించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. కొల్హాపూర్‌లోలోని అర్జున్‌ అడ్నాయక్‌ అనే కార్డియాలజిస్ట్‌ను కలవడానికి ఓ పేషెంట్‌ వెళ్లాడు. ఆ సమయంలో డాక్టర్‌కి అవతలి వైపు కుర్చీలో కూర్చున్నాడు సదరు పేషెంట్‌. ఇంతలోనే సదరు వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తేలేసి కూర్చున్న కుర్చీలోనే పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన డాక్టర్‌ వెంటనే పేషెంట్‌ వద్దకు వచ్చి అతని గుండెపై సీపీఆర్‌ విధానంలో బాదాడు. దీంతో ఆగిన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది, కొన్ని సెకండ్లలోనే వ్యక్తి కళ్లు తెరిచాడు. ఇదంతా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

హార్ట్ అటాక్ వైరల్ వీడియో..

ఈ వీడియోను కోల్హాపూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ ధనంజయ్‌ మహదిక్‌ ట్వీట్‌ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోగి ప్రాణాన్ని కాపాడిన రియల్ హీరో ఈ డాక్టర్‌ అంటూ ఆయన వీడియోను ట్వీట్‌ చేశారు. ఈ వీడియో  చూసిన నెటిజన్లు సైతం డాక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..