Shocking Video: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. ఈత కొడుతూ గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి.. (వీడియో)
మహారాష్ట్రలోని మాలెగావ్ లో ఈత కొడుతూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్ట్ 28న జరిగింది. అయితే.. ఈ దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా..
మహారాష్ట్రలోని మాలెగావ్ లో ఈత కొడుతూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్ట్ 28న జరిగింది. అయితే.. ఈ దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడు జయేష్ భావ్‌సర్‌గా గుర్తించారు. వైరల్ వీడియోలో యువకుడు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ కనిపించాడు. ఆ తర్వాత క్షణాల్లోనే అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. నీటిలో విలవిలలాడుతూ కనిపించిన ఆ యువకుడిని మరో ఇద్దరు యువకులు అతన్ని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరణం ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos