Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరుదైన పాము.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది.. ఒళ్లు జలదరించే వీడియో వైరల్‌..

ఈ మధ్య కాలంలో విస్తారంగా వర్షాలు పడటంతో పాములు ఇంటి బాల్కనీ,షూ రాక్‌లు, కార్లు, బండ్లలో చొరబడిన వీడియోలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అలాగే, ఇటీవల ఓ పాము నడిరోడ్డుపై గుంతలు తీయటం కనిపించింది. గుంతలు తీస్తున్న పామును చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో మరో అరుదైన పాము ప్రత్యక్షమైంది.

Viral Video: అరుదైన పాము.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది.. ఒళ్లు జలదరించే వీడియో వైరల్‌..
Snake Giving Birth
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 16, 2024 | 11:33 AM

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాతుల పాములు ఉన్నాయి. ఇవి రకరకాల రంగులతోపాటు వాటి ఆకృతి, జీవనవిధానం కూడా భిన్నంగా ఉంటాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి కూడా ఉన్నాయి. కొన్ని రకాల పాములు కాటేయడం వల్ల ఏటా లక్షల మంది మరణిస్తున్నారు. పాములు సాధారణంగా సంతానోత్పత్తి కోసం గుడ్లు పెడతాయి. కానీ, ఎప్పుడైనా పాములు నేరుగా పిల్లల్ని కనడం చూశారా..? అలాంటి అరుదైన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల మనం గోతులు తీస్తున్న పామును చూశాం.. తాజాగా అలాంటిదే మరోకటి అరుదైన పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాము వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. ఈ వైరల్‌ వీడియోలో ఒక పాము నడిరోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది. ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో నడిరోడ్డుపై వెళ్తున్న పాము పిల్లల్ని పెడుతోంది. అక్కడే మెలికలు తిరుగుతుంది. దాని తోక కింది భాగం నుంచి పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. పాములను చూసే ఔత్సాహికులు, జంతుప్రేమికులు ఎగబడి మరీ ఈ వీడియోని చూస్తున్నారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ దృశ్యం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొంత మంది తమ కెమెరాల్లో ఈ పాము వైరల్‌ వీడియోను రికార్డ్‌ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీనికి కోట్లలో వ్యూస్‌ రాగా, వేలల్లో లైకులు కూడా కొట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..