Viral Video: దేశ సేవకు బయలుదేరిన జవాన్.. అమ్మ ఆత్మీయ వీడ్కోలు.. ఆకట్టుకుంటున్న తల్లితనయుడి ప్రేమ
మనం దేశంలోపల చిన్న చిన్న విషయాలకే కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం.. మనకు ప్రభుత్వం ఇంకా ఏదో చెయ్యలేదు అంటూ నిత్యం అసంతృప్తితో గడిపేస్తూ ఉంటాం.. ఇలా మనం అంతా రోజుని గడపడానికి కారణం.. దేశ సరిహద్దు దగ్గర ముష్కర మూకల నుంచి రక్షణ కలిపిస్తూ నిరంతరం కావాలా ఉండే సైనికులే. దేశ రక్షణ కోసం కుటుంబాన్ని మాత్రమే కాదు.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయని ధీరుడు.. పిలిచించే తడవుగా కదన రంగంలో దూకి శత్రు సంహారం చేసే వీరుడు. అటువంటి ఒక సైనికుడికి సంబంధించిన ఒక భావోద్వేగ వీడియో వైరల్ అయింది. తల్లి దేశ సేవ కోసం బయలుదేరిన తన కొడుక్కి వీడ్కోలు పలకడం.. చూపరులను కన్నీరు పెట్టిస్తుంది.

దేశ సరిహద్దులో ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా దేశాన్ని రక్షించే సైనికుల దేశ సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ కొడుకు దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమై ఉండటం తల్లిదండ్రులు తమకు గర్వకారణంగా భావిస్తారు. అయితే తమ కొడుకును దేశానికి సేవ చేయడానికి పంపుతున్న సమయంలో.. వారికి గర్వంతో పాటు, కళ్ళు కూడా తడిసిపోతాయి. మనస్సు బరువెక్కుతుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో అలాంటి భావోద్వేగ దృశ్యానికి నిదర్శనం. ఒక తల్లి తన కొడుకును నుదిటిపై ముద్దు పెట్టుకుని దేశానికి సేవ చేయడానికి పంపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇట్క్స్-షిరామ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక కుటుంబం తమ కొడుకును దేశానికి సేవ చేయడానికి పంపడానికి బస్ స్టాండ్‌కు వచ్చింది. ఈ సమయంలో తల్లి భావోద్వేగానికి గురై తన కొడుకు బుగ్గమీద, నుదిటిపై ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత తన ప్రియమైన కొడుకుకు కరచాలనం చేసి వీడ్కోలు పలికింది. ఈ వీడియోలో ఆర్మీ జవాన్ తండ్రి, కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలలో బంధించారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.
View this post on Instagram
ఈ వీడియోను లక్షా నలభై వేల మందికి పైగా వీక్షించి.. ఈ భావోద్వేగ వీడ్కోలు క్షణంపై వ్యాఖ్యానిస్తున్నారు. ఆ అద్భుతమైన క్షణాన్ని సెల్ లో చిత్రీకరించినందుకు ఒకరు థాంక్స్ తెలిపారు. మరొకరు “మన దేశం సంతోషకరమైన దేశం, సైనికుడి ప్రయాణం సంతోషంగా ఉంది, నమస్తే అమ్మ” అని వ్యాఖ్యానించారు. అమ్మా.. నువ్వు నిజంగా గ్రేట్.. నీ కొడుకు సరిహద్దులో నిలబడి దేశాన్ని కాపాడుతూ గర్వకారణమైన పని చేస్తున్నాడు” అని మరొకరు కామెంట్ చేయగా.. కొందరు హార్ట్ సింబల్స్ ని పంపించి తమ ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




