మరణంలోనూ వీడని బంధం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతి
వాళ్లీద్దరూ దంపతులు. పెళ్లైన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా బతికారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని దంపతులుగా ఊరందరికీ వారు పరిచితులే. అయితే.. కొంతకాలం క్రితం అనారోగ్యంతో ఆ భర్త మంచానపడ్డాడు. కానీ, ఆ భార్య ఆయనను చంటి బిడ్డలా చూసుకుంది. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా 20 ఏళ్లు సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది.
జీవితభాగస్వామి కోసం ఈ 20 ఏళ్లలో ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలను ఎదుర్కొంది. అయితే.. ఊహించని రీతిలో ఆమె కూడా అనారోగ్యం పాలై శనివారం కన్నుమూసింది. కట్టుకున్న భార్య కళ్లముందే కన్నుమూయటంతో.. ఆమె భర్త తట్టుకోలేకపోయాడు. నీ వెంటే నేనూ.. అంటూ ఆమెనే తలచుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఊరందరికీ ఆదర్శంగా నిలిచిన భార్యాభర్తలు.. గంటల వ్యవధిలో కన్నుమూయటంతో ఊరుఊరంతా కన్నీరు కార్చింది. జగిత్యాల జిల్లా రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మి, రాజనర్సుల దంపతులకు ఒక కొడుకు. గత ఇరవై ఏళ్ల క్రితం రాజనర్సు వృత్తిరీత్యా వెదురు బొంగులు తీసుకురావటానికి వెళ్లగా కిందపడటంతో గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినా మంచం నుండి లేవలేని పరిస్థితి నెలకొంది. దీంతో 20 ఏళ్లుగా అతని భార్య లక్ష్మి అన్నీతానై సపర్యలు చేసింది. ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా ఇలా అన్నీ పాత్రలు పోషించి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది. అయితే.. కొంతకాలంగా లక్ష్మి కూడా అనారోగ్యంతో బాధపడుతూ.. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందింది. అయితే భార్య మరణం రాజనర్సును కుంగదీసింది. అచేతనంగా పడి ఉన్న భార్యను పిలిచీ పిలిచీ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే నీ వెంటే నేను వస్తున్నానంటూ ఆయనా ప్రాణాలు విడిచాడు. దంపతుల మృతి చెందిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. బంధుమిత్రులంతా కలిసి.. వారిద్దరికీ ఒకే చితిపై అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన స్థానికుల హృదయాలను కలిచి వేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

