ప్రకృతి వైపరీత్యాల సమయంలో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జంతు నష్టం కూడా ఎక్కువుగా జరుగుతుంది. ఎన్నో జంతు జాతులు తమ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల ఇయాన్ హరికేన్ ఫ్లోరిడాలో పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హరికేన్ భీభత్సం తర్వాత ఓ వ్యక్తి ఉడతను కాపాడిన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరికేన్ ఇయాన్ ఫ్లోరిడా గల్ఫ్ తీరాన్ని తాకడంతో , చాలా మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. తీవ్ర ఆస్తినష్టం జరిగింది. రహదారులు దెబ్బతిన్నాయి. ఈ ప్రకృతి విపత్తు నుంచి తమను తాము రక్షించుకోవడానికి అక్కడి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ విపత్తు దాటికి సుమారు వంద మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది విపత్తు నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో మరికొంత మంది జంతువులను కాపాడటానికి తమ వంతు సహాయం చేశారు. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
హరికేన్ తర్వాత ఒక వ్యక్తి ఉడుతను రక్షించిన వీడియోను ఓ వినియోగదారుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి నీటి కుంటలోకి వెళ్లి ఉడుతను పట్టుకోవడానికి ప్రయత్నించగా, అప్పుడు ఉడుత అతనిపైకి దూకి అతని జాకెట్ లోపలకి వెళ్తుంది. అయినా విసుగు చెందకుండా, ఆ వ్యక్తి ఉడతను తన ఇంటికి తీసుకెళ్లి, ఉడుతకి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత దానిని తీసుకొచ్చి మళ్లీ ప్రకృతిలో అంటే చెట్టుపై గూడులో వదిలిపెట్టాడు.
ఇందులో మరో విషయం ఏమిటంటే ఆ ఉడత ఎలా ఉందో అని రోజూ వెళ్లి చూసుకుంటున్నాడు ఆ వ్యక్తి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ కామెంట్లతో ఉడతను రక్షించిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వ్యక్తిని భగవంతుడు ఆశీర్వదిస్తాడని ఒకరు కామెంట్ చేయగా, అతడు చాలా దయ గల వ్యక్తి అని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..