AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఓరీ దేవుడో..! ఎత్తైన కొండపై వేలాడుతున్న కారు.. చివరకు ఏమైంది..? ఆ డ్రైవర్‌ పరిస్థితి ఎలా ఉందో చూడాల్సిందే..

ఆ రోడ్డు కేవలం టూవీలర్‌ వాహనాలు మాత్రమే ప్రయాణించేలా ఉంది.. కానీ, అతడు కారుతో పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు..అంతే, ఆ కారు ఇరుకైన రోడ్డులో ఇరుక్కుపోయింది. అతని కారు వెనుక భాగం లోతైన లోయవైపు వేలాడుతూ కనిపిస్తుంది. అయితే, ఈ దృశ్యం వీడియో చూస్తున్న వారి ప్రాణాలు కూడా టెన్షన్‌లో పడేసింది.. ఇక కారు బయటకు వచ్చే మార్గం లేదు.. కానీ, అప్పుడు ఆ డ్రైవర్..

Watch Video: ఓరీ దేవుడో..! ఎత్తైన కొండపై వేలాడుతున్న కారు.. చివరకు ఏమైంది..?  ఆ డ్రైవర్‌ పరిస్థితి ఎలా ఉందో చూడాల్సిందే..
Car Stunt
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2024 | 3:50 PM

Share

Car Stunt Video: సోషల్ మీడియా వేధికగా చాలా మంది విన్యాసాలు చేస్తున్న వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. కొందరు సైకిల్ లేదా బైక్‌పై విన్యాసాలు చేస్తూ కనిపిస్తే, మరికొందరు కారుపై విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఎత్తైన భవనాల నుంచి కూడా దూకుతుంటారు. ప్రస్తుతం, సోషల్ మీడియా స్టంట్ వీడియో మరోకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన వారిని షాక్‌కు గురిచేస్తుంది. ఇరుకైన రోడ్డులో ఓ కారు ఎలా ఇరుక్కుపోయిందో వీడియోలో చూడొచ్చు. కేవలం బైకులు, సైక్లిస్టులు మాత్రమే వెళ్లగలిగే రహదారిలో ఓ వ్యక్తి కారుతో వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఓ వ్యక్తి కారుతో కొండ ప్రాంతాలకు బయల్దేరాడు. అయితే, ఆ రోడ్డు కేవలం టూవీలర్‌ వాహనాలు మాత్రమే ప్రయాణించేలా ఉంది.. కానీ, అతడు కారుతో పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు..అంతే, ఆ కారు ఇరుకైన రోడ్డులో ఇరుక్కుపోయింది. అతని కారు వెనుక భాగం లోతైన లోయవైపు వేలాడుతూ కనిపిస్తుంది. అయితే, ఈ దృశ్యం వీడియో చూస్తున్న వారి ప్రాణాలు కూడా టెన్షన్‌లో పడేసింది.. ఇక కారు బయటకు వచ్చే మార్గం లేదని అందరూ భావిస్తున్నారు. అప్పుడు కారులో కూర్చున్న వ్యక్తి తనలోని టాలెంట్‌ను చూపించాడు.. కొంత సమయం తీసుకుని ఇరుకైన రోడ్డు గుండా కారును తీసుకెళ్లాడు. అతని తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Rizzy Talk (@rizzytalk)

అసలే ఎత్తైన కొండ.. పైగా ఇరుకైన మార్గంలో ఆ వ్యక్తి కారును తిప్పిన తీరు చూసి అందరూ షాక్‌ అవుతున్నారు.. బాప్‌రే..ఇతడిని మించిన హెవీ డ్రైవర్ ఇంకేవరూ ఉండరనుకుంటా.. అంటున్నారు. ఈ వీడియో రిజిటాక్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఇంత ప్రమాదకరమైన డ్రైవింగ్ మీరు ఎలా నేర్చుకున్నారు బ్రదర్?’ అంటూ అడుగుతున్నారు. ‘డ్రైవర్ మౌంటైన్ డ్యూ తాగినట్టున్నాడు..అంటూ మరొకరు ఫన్నీ కామెంట్‌ చేశారు. ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో దానికి వస్తున్న వీక్షణలను బట్టి అంచనా వేయవచ్చు. ఈ వీడియోకు 26 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..