Viral Video: మీ దుంపతెగ.. ఏంట్రా ఇదీ.. కొత్త పెళ్లి జంటకు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే అవాక్కే..
పెళ్లి జంటకు వారి ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్ వైరల్‌గా మారింది. ఈ వింత గిఫ్ట్‌ను చూసి పెళ్లి జంటతో పాటు అందరూ అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు సరదాగా తీసుకుంటున్నా, మరికొందరు ఇలాంటివి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ సంఘటన పెళ్లి జంటకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

సాధారణంగా పెళ్లి వేడుకల్లో నవ దంపతులకు స్నేహితులు బంగారు, వెండి వస్తువులను లేదా వినూత్నమైన బహుమతులను ఇస్తుంటారు. కానీ ఇటీవల జరిగిన ఒక వివాహంలో స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ చూసి పెళ్లి జంటతో పాటు అక్కడున్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఫ్రెండ్స్ ఏకంగా టాయిలెట్ ఆకారంలో ఉన్న కేక్‌ను కట్ చేయమని ఆ జంటకు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
నవ దంపతులు ఈ గిఫ్ట్‌ను చూసి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉండిపోయారు. ఇదేం కేకురా.. దీన్ని ఎలా కట్ చేయాలంటూ ఫేస్ పెట్టారు. ఈ కేక్‌ను చూసిన స్టేజీ మీద ఉన్నవారంతా అవాక్కయ్యారు. ఇటీవలి కాలంలో వివాహ వేడుకల్లో థీమ్ కేక్‌లు లేదా విభిన్నమైన కేక్‌లను కట్ చేయడం ట్రెండ్‌గా మారింది. కానీ ఈ టాయిలెట్ కేకును మాత్రం పెళ్లి జంట అస్సలు ఊహించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఇటువంటివి ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పెళ్లి జంట తమ జీవితంలో ఈ వింతైన కేక్ కట్టింగ్ అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే అవకాశం ఉంది.
Chocolate cake❌ Toilet cake ✅ pic.twitter.com/kURQSqltcA
— Bhumika (@sankii_memer) December 1, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
