AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం లక్​ గురూ..! చావు నోట్లో తలపెట్టి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే గుస్‌బంప్స్‌ రావాల్సిందే ?

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఇంతలో ఒక JCB మెషీన్ వాహనం అతన్ని పక్కగా అదే రోడ్డుపై వెళ్తోంది. అకస్మాత్తుగా దాని పై కప్పు లేచి బైక్‌పై వెళ్తున్న యువకుడి తలపై పడింది. ఈ దృశ్యం చూసేందుకు మాత్రం భయంకరంగా ఉంది.. ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది...

Viral Video: ఏం లక్​ గురూ..! చావు నోట్లో తలపెట్టి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే గుస్‌బంప్స్‌ రావాల్సిందే ?
Youth Survives Metal Sheet
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2024 | 9:03 PM

Share

సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో బరువైన జేసీబీ షీట్ ఉన్నట్టుండి వాహనం నుండి వీడిపోయి..ఓ యువకుడిపై పడింది. యాదృచ్ఛికంగా ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు ఈ సంఘటన ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతబరువైన జేసీబీ ఐరన్‌ షీట్‌ ఎగిరొచ్చి అమాంతంగా యువడి తలపై పడితే.. ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించగలరు.. కానీ, ఇక్కడ జరిగింది చూస్తే మీరు షాక్‌ అవుతారు. అతడు..యముడినే ఎదురించాడని అంటారు.. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఇంతలో ఒక JCB మెషీన్ వాహనం అతన్ని పక్కగా అదే రోడ్డుపై వెళ్తోంది. అకస్మాత్తుగా దాని పై కప్పు లేచి బైక్‌పై వెళ్తున్న యువకుడి తలపై పడింది. ఈ దృశ్యం చూసేందుకు మాత్రం భయంకరంగా ఉంది.. ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో పాపం.. ఇదేం కర్మ.. తలకు హెల్మెట్‌ పెట్టుకుని ఎంత జాగ్రత్తగా బైక్‌ నడుపుతున్నప్పటికీ మృత్యువు ఇలా వెంటాడిందని షాక్‌ అవ్వాల్సిందే..కానీ, ఇక్కడే విధి చేసే అద్భుతం మరోమారు రుజువైంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ బైక్‌ వెళ్తూ ప్రమాదానికి గురైన యువకుడి అదృష్టం బాగుంది.. అతడు తలకు హెల్మెట్‌ ధరించి ఉండటం వల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఇదంతా చూస్తే షాకింగ్‌ ఉంది కదా.. కానీ ఇది ఖచ్చితంగా నిజం.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియోపై నెటిజన్లు భారీగా కామెంట్ చేశారు. చాలా మంది ప్రజలు హెల్మెట్‌లను ట్విర్లర్‌లకు ప్రాణాలను రక్షించేవిగా అభివర్ణించారు. బైకర్‌కు ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఆదర్శం ఇతరులకు గుణపాఠం అన్నారు. మీరు నియమాలను అనుసరించండి అంటూ పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..