Viral Video: వామ్మో.. ఈమె ఇక లైఫ్‌లో బర్త్ డే జరుపుకోదు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
ఏ పని చేస్తున్నా.. అలెర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు.. ఎటు వైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేం.
ఏ పని చేస్తున్నా.. అలెర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు.. ఎటు వైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేం. నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాగా ఈ మధ్య ఓ బర్త్ డే సందర్భంగా కేక్ కోస్తున్నప్పడు జరిగిన ప్రమాదం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంట్లో మంచి బర్త్ డే హంగామా నడుస్తోంది. గెస్టులు వచ్చారు. కేక్ కటింగ్‌కి అంతా సిద్దం. లైట్స్ ఆఫ్ చేశారు. కేక్ నిండా కొవ్వొత్తులు వెలిగించారు. ఆ కొవ్వెత్తులు ఆర్పే క్రమంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు ఆమెకు మరిచిపోలేని ట్రాజెడీగా మారింది. కొవ్వొత్తులను ఆర్పే ప్రయత్నంలో … ఆ మహిళ జుట్టుకు క్యాండిల్స్ మంట తగిలి నిప్పంటుకుంది. అయితే హెయిర్‌కి ఫైర్ అంటుకుంటే వెంటనే కాలిపోతుంది. దీంతో ఆ బర్త్ డే పార్టీ అర్థాంతరంగా ఆగిపోయింది.
అమెరికాలోని ఆగ్డెన్‌లో ఈ హారిబుల్ ఇన్సిడెంట్ జరిగింది. అనా ఊస్టర్‌హౌజ్ అనే 34 ఏళ్ల మహిళ.. తన 7 ఏడేళ్ల కుమారుడితో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊహించని ఘటనకు షాక్ అయిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్.. వెంటనే ఆమె జుట్టుకు అంటుకున్న నిప్పును ఆర్పేసి ఆమెను రక్షించారు. కానీ అప్పటికే ఆమె కుడివైపు జుట్టు, కనుబొమ్మలు, కను రెప్పలు కాలిపోవడంతో పాటు ముఖానికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై అనా స్పందిస్తూ.. తన ఫ్యామిలీ లేకుంటే ప్రాణాలతో ఉండేదానిని కాదని చెప్పుకొచ్చింది. ఆ షాక్ లోంచి బయటికి రావడానికి చాలా సమయమే పట్టిందన్న అనా.. ఇకపై ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు పుట్టినరోజు వేడుకలు జరిగిన.. సాధ్యమనంత వరకు క్యాండిల్స్ లేకుండా చూసుకుంటానని చెప్పింది. ఒకటికి మించి ఎక్కువ క్యాండిల్స్ ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
Also Read: Viral: తన ఆవు పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో రైతు ఫిర్యాదు.. ఆ తర్వాత
నడిరోడ్డుపై స్కూల్ గర్ల్స్ ఫైట్.. గ్యాంగులుగా విడిపోయి మరీ.. ఆశ్చర్యపోయిన స్థానికులు