Viral: తన ఆవు పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో రైతు ఫిర్యాదు.. ఆ తర్వాత

ఇదో విచిత్రమైన ఘటన. తన ఆవు పాలు ఇవ్వడం లేదని ఓ రైతు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు కర్ణాటక షిమోగా జిల్లాలో ఈ ఉదంతం వెలుగు చూసింది.

Viral: తన ఆవు పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో రైతు ఫిర్యాదు.. ఆ తర్వాత
సొంత ఆవుపై ఫిర్యాదు చేసిన రైతు
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 08, 2021 | 3:23 PM

ఇదో విచిత్రమైన ఘటన. తన ఆవు పాలు ఇవ్వడం లేదని ఓ రైతు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు కర్ణాటక షిమోగా జిల్లాలో ఈ ఉదంతం వెలుగు చూసింది. సిద్లీపూర్ గ్రామంలో నివసిస్తున్న ఓ రైతు తన సొంత ఆవుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పెట్టాలని కోరాడు. మేత వేసినా ఆవు పాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామయ్య అనే రైతు హోలెహోన్నూరు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేసి… తన సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఆవుకు ఉదయం 8 గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, 6 గంటలకు మేత వేస్తున్నానని.. అయినా పాలివ్వడం లేదని వాపోయాడు. పాలు ఇచ్చేలా ఒప్పించాలని.. ఈ కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోవాలని పోలీసులను అభ్యర్థించాడు. గద్దించో, బ్రతిమాలో పాలు ఇచ్చేలా ఒప్పించాలని కోరాడు. రైతు సమస్య విని పోలీసులు  ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి కేసుల్లో తామూ ఏమీ చేయలేరని అతని నచ్చజెప్పారు. 

మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే…

గత నెలలో ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జరిగింది. ఒక రైతు తన గేదెను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, పాలు ఇవ్వడానికి నిరాకరిస్తుందని ఫిర్యాదు చేశాడు. కొంతమంది గ్రామస్తులు తన గేదెకు చేతబడి చేశారని.. అందుకే అది పాలివ్వడం లేదని పేర్కొన్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిర్యాదుదారు అమాయకత్వాన్ని చూసి.. కొంతమంది నెటిజన్లు నవ్వుకున్నారు. ఇంకొంతమంది అతడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు.  ఇలాంటి రైతులు పోలీసుల వద్దకు కాకుండా వెటర్నరీ డాక్టర్లు,  జంతు నిపుణుల వద్దకు వెళ్తే బెటర్ అని.. మరికొందరు కామెంట్లు పెట్టారు. 

Also Read: నడిరోడ్డుపై స్కూల్ గర్ల్స్ ఫైట్.. గ్యాంగులుగా విడిపోయి మరీ.. ఆశ్చర్యపోయిన స్థానికులు

వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌బాడీ ఘటనలో పురోగతి.. మృతుడు ఇతడే