VIRAL VIDEO : సింహాన్ని వెనక కాళ్లతో కుమ్మేసిన జీబ్రా..! మృగరాజు ఊరుకుంటుందా..? ఏం చేసిందో మీరే చూడండి..
VIRAL VIDEO : వేట అనేది సింహం స్వభావం. అందువల్ల అడవిలోని జంతువులన్నీ సింహం నుంచి దూరంగా ఉంటాయి.
VIRAL VIDEO : వేట అనేది సింహం స్వభావం. అందువల్ల అడవిలోని జంతువులన్నీ సింహం నుంచి దూరంగా ఉంటాయి. కానీ సింహం అడవికి రాజు అతను కోరుకున్న చోటికి వెళ్లి తన ఆహారాన్ని సంపాదించుకోగడు. కానీ కొన్నిసార్లు వేటాడటానికి చాలా పాట్లు పడాల్సివస్తోంది. వాస్తవానికి సింహం ఎంత శక్తివంతంగా ఉన్నా కొన్నిసార్లు అతను దెబ్బలు కూడా తినవలసి ఉంటుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియోలో జీబ్రాను పట్టుకోవటానికి అడవిలోని ఓ సింహం వేగంగా పరిగెత్తడం చూడవచ్చు. జీబ్రా కూడా తన ప్రాణాలను కాపాడటానికి తీవ్రంగా పరుగెడుతూ ఉంటుంది. సింహం జీబ్రాపై పంజా విసురుతుంది. సరిగ్గా అదే సమయంలో జీబ్రా తన రెండు వెనక కాళ్లతో సింహానికి ఒక్క కిక్ ఇస్తుంది. వెంటనే సింహం ఎగిరి ఎక్కడో పడుతుంది. జీబ్రా సమయస్ఫూర్తితో సింహానికి చిక్కకుండా తప్పించుకుంటుంది.
అయితే దీని తరువాత ఏం జరిగిందో వీడియోలో లేదు. కనుక జీబ్రా తప్పించుకోగలిగిందా లేదా అనేది చెప్పలేం. ఈ వీడియోను వొవాఫ్రికా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేయబడి 24 గంటలు కూడా కాలేదు దానిపై చాలా కామెంట్స్, లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన తరువాత ఒక వినియోగదారు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఏ జంతువైనా సింహం నుంచి తప్పించుకోవచ్చని రాశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయబడినప్పటి నుంచి ఈ వీడియోకు 14 వేలకు పైగా లైకులు వచ్చాయి. అదే సమయంలో ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. కనుక విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీనిపై ప్రజలు తమ కామెంట్స్‌ను త్వరగా తెలియజేస్తారు. అందుకే కొన్నిసార్లు ఈ వీడియోలు చాలా వైరల్ అవుతాయి.
View this post on Instagram