Viral Video: మట్టిలో మాణిక్యం.. ఈ బాలుడు ప్రతిభకు పదును పెడితే.. ఒలింపిక్స్ పతకం ఖాయం అంటున్న నెటిజన్లు
అత్యంత ప్రతిభావంతులైనవారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ టాలెంటెడ్ కుర్రాడి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. స్లమ్ ఏరియాలోనే తన ప్రతిభను ప్రదర్శించాడు.
Viral Video: ప్రతిభకు ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు.. కొంతమంది ఎదో సాధించాలని కలలు కంటారు. తమ పరిస్థితి ని చూసి.. తాము కన్న కలలను పక్కన పెట్టారు.. వాటిని నెరవేర్చుకోవడానికి పట్టుదలతో పనిచేస్తారు. కష్టపడి తమ తలరాతను తామే లిఖించుకుంటారు. అలంటి వ్యక్తులకు చెందిన వీడియోలను మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా అత్యంత ప్రతిభావంతులైనవారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ టాలెంటెడ్ కుర్రాడి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. స్లమ్ ఏరియాలోనే తన ప్రతిభను ప్రదర్శించాడు.
వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే.. ఈ క్లిప్ స్లమ్ ఏరియాలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్లమ్ ఏరియాలో కొంతమంది నిలబడి ఉన్నారు. అదే సమయంలో ఒక పిల్లవాడు చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ.. అక్కడ ఉన్న చెత్త ఉన్న ప్రాంతాలో చేసిన ఫీట్ అందరినీ ఆకట్టుకుంది. బాలుడు ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడిలా చేసిన స్టంట్ చూసి ఆశ్చర్యపోతారు. బాలుడు పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్లి.. అక్కడ గాలిలో ఎగిరి.. ఫల్టీలు కొడుతూ.. తిరిగి నేలమీద చేరిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ వీడియో ఎక్కడిది అనేది ఇంకా తెలియనప్పటికీ.. ఇది స్లమ్ ఏరియాలో జరిగిన సంఘటన అని తెలుస్తోంది.
Bravo baby! ?❤️pic.twitter.com/swLo2MmVPf
— Figen (@TheFigen) May 23, 2022
ఈ షాకింగ్ వీడియో @TheFigen అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. దీనితో బ్రావో బేబీ అని క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ వీడియోకు 4.5 లక్షలకు పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. అంతేకాదు పలువురు ఆ బాలుడి ప్రతిభకు ఫిదా అయ్యారు. ఎవరైనా ఆ బాలుడి ప్రతిభకు పదును పెట్టేలా అతనికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ కామెంట్ చేస్తే.. ఆ బాలుడు ఉన్న దేశం ప్రభుత్వం అతనికి అన్ని విధాలా వెన్నుదన్నుగా ఉండాలని కోరుతున్నట్లు మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..