Viral Video: వావ్‌.. అట్లుంటది మరి ఐఏ రోబోతోని… స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల నుంచి మరో అద్భుత ఆవిష్కరణ

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మానవ జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీ చొరబడింది. మనుషులతో సంబంధం లేకుండానే అన్ని పనులు యంత్రాలు చక్కగా చేసి పెడుతోంది ఏఐ. తాజాగా...

Viral Video: వావ్‌.. అట్లుంటది మరి ఐఏ రోబోతోని... స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల నుంచి మరో అద్భుత ఆవిష్కరణ
Robot Playing Badminton

Updated on: Jun 05, 2025 | 4:27 PM

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మానవ జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీ చొరబడింది. మనుషులతో సంబంధం లేకుండానే అన్ని పనులు యంత్రాలు చక్కగా చేసి పెడుతోంది ఏఐ. తాజాగా స్విట్జర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు ఏఐ టెక్నాలజీ సాయంతో ఓ రోబోను సృష్టించారు. అది ఏకంగా బ్యాడ్మింటన్ ఆడేస్తోంది. మైదానంలో చురుకుగా కదులుతూ దూసుకొచ్చే బంతులను అంతే వేగంతో బ్యాట్‌తో ఎదుర్కొంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈటీహెచ్ జ్యూరిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అద్భుతాన్ని సృష్టించారు. మనిషి మేధస్సుకు సవాలు విసురుతూ యంత్రాలు అత్యంత క్లిష్టమైన పనులను సైతం అలవోకగా పూర్తి చేస్తున్నాయనడానికి ఈ రోబోనే ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు బ్యాడ్మింటన్ క్రీడలో మనుషులతో పోటీపడగల ఏఐ రోబోను తయారు చేశారు.

ఈ నాలుగు కాళ్ల రోబోకు ఒక స్టీరియో కెమెరా, బ్యాడ్మింటన్ రాకెట్‌ను పట్టుకోవడానికి అనువుగా ఒక డైనమిక్ చేయిని అమర్చారు. అంతే కాకుండా రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్’ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రోబోకు ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. షటిల్‌కాక్ కదలికలను గమనించి, దాని గమనాన్ని అంచనా వేస్తూ, కోర్టులో చురుగ్గా కదులుతూ షాట్‌లను తిరిగి కొట్టగలుగుతోంది.

రోబోలు అంటూ మనుషులను పోలి ఉండే రెండు కాళ్ల రోబోలే చూశాం కానీ, దీనికి నాలుగు కాళ్లు ఉండటం విశేషం. ఈ ప్రయోగం అటానమస్ వ్యవస్థలు, హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో కీలక ముందడుగు అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ, గృహ సేవలు వంటి రంగాల్లో కూడా ఇలాంటి రోబోల వినియోగానికి ఈ ఆవిష్కరణ బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

వీడియో చూడండి: