Viral Video: ఈ దివ్యాంగ బాలుడి మనోధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.. నెటిజన్ల హృదయాలను కదిలిస్తోన్న వీడియో

Inspiration: ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం తోడుగా ఉంటే మన బలహీనతలను కూడా బలంగా మార్చకోవచ్చు. ప్రపంచానికి మనల్ని మనం పరిచయం చేసుకోవచ్చు.

Viral Video: ఈ దివ్యాంగ బాలుడి మనోధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.. నెటిజన్ల హృదయాలను కదిలిస్తోన్న వీడియో
Specially Abled Child
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2022 | 9:37 AM

Inspiration: ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం తోడుగా ఉంటే మన బలహీనతలను కూడా బలంగా మార్చకోవచ్చు. ప్రపంచానికి మనల్ని మనం పరిచయం చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులను కూడా భూతద్దంలో చూసి కుమిలిపోయే వాళ్లు ప్రస్తుతం చాలామందే ఉన్నారు. అలాంటి వారు ఈ ఇన్‌స్పిరేషనల్‌ వీడియో కచ్చితంగా చూడాల్సిందే. ఇది చూసిన తర్వాత మీలో మళ్లీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగ బాలుడు తన రోజువారీ కార్యక్రమాలను ఎలా చేసుకుంటున్నాడో మనం చూడవచ్చు. స్కూల్‌లో పిల్లలందరితో పాటు భోజనం చేయడానికి కూర్చున్న ఆ పిల్లాడు రెండు చేతులు లేకున్నా.. నోటితో, చెంచాతో తన ఆకలిని తీర్చుకోవడం మనం చూడవచ్చు. అలాగే కాళ్లు లేకున్నా తోటి విద్యార్థులతో కలిసి సందడి చేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

స్ఫూర్తి కోసం మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా వంటి వ్యక్తులను గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే వ్యక్తులే అలాంటి స్పార్క్‌ను కలిగి ఉంటారు. ఈ కోవకే చెందుతాడు ఈ దివ్యాంగ బాలుడు. జీవితంలో చాలామందికి ఈ చిన్నారి స్ఫూర్తి అని చెప్పడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. ‘దేవుడు మాకు అన్యాయం చేశాడనే వారందరికీ ఈ చిన్నారి ఇన్‌స్పిరేషన్‌. జీవితంలో నిరాశా, నిస్పృహలతో బతికే వారు ఈ వీడియోను చూసి కచ్చితంగా మారుతారు’ అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..