వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు తెగ ముచ్చట పడుతున్నారు. అంతే కాదు వాటిని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. పెళ్లి జరుగుతున్న సమయంలో జరిగే చిన్న చిన్న సరదా సంఘటనలకు చెందిన వీడియోలను వారు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పెళ్లి సమయంలో వివిధ రకాల సన్నాహాలు జరుగుతుంటాయి. ఈ రోజుల్లో పెళ్లికి సంబంధించిన ఇలాంటి వీడియో ఇంటర్నెట్లో హాట్ హాట్‌గా మారుతున్నాయి. పెళ్లి తర్వాత బరాత్ నిర్వహించడం కామన్‌గా జరుగుతుంది. ఆ సమయంలో జరిగిన ఓ సరదా సన్నివేశమే ఈ రోజు ట్రెండింగ్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో బరాత్ కోసం సిద్దమవుతున్న వరుడిని చూడవచ్చు. ఇందులో వరుడు పంచకళ్యాణి గుర్రం స్వారీ చేస్తూ అక్కడికి చేరుకుంటాడు. అతనికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పాట్లు చేస్తుంటారు. పెద్ద ఎత్తున బ్యాండ్ బాజా మోగుతుంటుంది. అయితే అక్కడికి వచ్చినవారు బాణాసంచా కాల్చడం మొదలు పెడుతారు. ఆ భారీ శబ్ధం విన్న గుర్రం పరుగులు మొదలు పెడుతుంది. ఆ గుర్రాన్ని కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా దొరకకుండా పోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను ఘంటా అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన కొన్ని గంట్లోలనే పెద్ద వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 37 లక్షల మందికి పైగా చూశారు. ఈ వీడియోపై యూజర్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: బాలీవుడ్లో థర్డ్ వేవ్ టెన్షన్.. కొంపముంచిన గెట్ టుగెదర్ పార్టీ.. కరణ్ జోహార్ ఇళ్లు సీజ్..